Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
RRR అప్డేట్.. మకాం మార్చేశారు.. అసలు కారణం ఇదే!
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ RRR. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు జక్కన్న. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. కానీ అనుకోని విధంగా RRR కి బ్రేకులు పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా షెడ్యూల్ విషయంలోనూ అనుకోని అంతరాయం నెలకొండనంతో రాజమౌళి షూటింగ్ స్పాట్ మార్చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాడట.
శరవేగంగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను పూణేలో జరగాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు ఆ షెడ్యూల్ లొకేషన్ మార్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పూణే నుండి లొకేషన్‌ను తమిళనాడు మార్చేయాలని డిసైడ్ అయ్యాడట జక్కన్న. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాకు వర్షం కారణంగా మరోసారి బ్రేక్ ఇవ్వడం కుదరదని, అందుకే రాజమౌళి లొకేషన్ చేంజ్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చారిత్రక నేపథ్యంలో ఎన్నో హంగులు జోడించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR సినిమా షూట్ చేస్తున్నారు రాజమౌళి. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కోలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ సముద్రఖని RRRలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.