twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR అప్‌డేట్.. మకాం మార్చేశారు.. అసలు కారణం ఇదే!

    |

    డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ RRR. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు జక్కన్న. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. కానీ అనుకోని విధంగా RRR కి బ్రేకులు పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా షెడ్యూల్ విషయంలోనూ అనుకోని అంతరాయం నెలకొండనంతో రాజమౌళి షూటింగ్ స్పాట్ మార్చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాడట.

    శరవేగంగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్‌ను పూణేలో జ‌ర‌గాల‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం మేరకు ఇప్పుడు ఆ షెడ్యూల్ లొకేష‌న్ మార్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పూణే నుండి లొకేష‌న్‌ను త‌మిళ‌నాడు మార్చేయాలని డిసైడ్ అయ్యాడట జక్కన్న. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాకు వర్షం కారణంగా మరోసారి బ్రేక్ ఇవ్వడం కుదరదని, అందుకే రాజమౌళి లొకేషన్ చేంజ్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    RRR Shooting Update.. Location changed to

    చారిత్రక నేపథ్యంలో ఎన్నో హంగులు జోడించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR సినిమా షూట్ చేస్తున్నారు రాజమౌళి. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కోలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ సముద్రఖని RRRలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

    English summary
    Rajamouli Now directed RRR movie. It will going to realese as fourth movie of ntr, Rajamouli successfull combo. Now this movie shooting in hyderabad without any publicity. As per latest news the next schedule shooting spot changed as Pune to Tamilanadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X