For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి ఊహించని న్యూస్: ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్‌తో పాటు అది కూడా.. బిగ్ సర్‌ప్రైజ్ లోడింగ్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది. దీంతో రిలీజ్ డేట్ మారొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తారక్ పుట్టినరోజు సందర్భంగా RRR మూవీ నుంచి పోస్టర్‌తో పాటు బిగ్ సర్‌ప్రైజ్ లోడింగ్ అవుతుందట. ఆ వివరాలు మీకోసం!

  విప్లవ వీరుల్లా మారిన టాలీవుడ్ స్టార్లు

  విప్లవ వీరుల్లా మారిన టాలీవుడ్ స్టార్లు

  ప్రజా సమస్యల పోరాటానికి నిలువుటద్దంలా నిలిచిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ చేస్తున్నారు.

  మరోసారి దెబ్బ.. క్లైమాక్స్ అలా ఆగింది

  మరోసారి దెబ్బ.. క్లైమాక్స్ అలా ఆగింది

  RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే పూర్తయింది. కానీ, ఇప్పటి వరకూ చిత్రీకరణ పూర్తీ కాలేదు. దీనికి కారణం షూటింగ్‌కు పలు ఆటంకాలు ఎదురు కావడమే. ఇక, ఈ మధ్యనే క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణను మొదలైంది. ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు. ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో ఈ షూటింగ్‌ మళ్లీ వాయిదా వేశారు.

  రెండు వీడియోలు... రికార్డులు బద్దలు

  రెండు వీడియోలు... రికార్డులు బద్దలు

  ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీని నుంచి ఏది వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రికార్డులు బద్దలయ్యాయి.

   విడుదలకు ముందే సంచలనంగా మారి

  విడుదలకు ముందే సంచలనంగా మారి

  పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఈ చిత్రం అమ్ముడు పోవడం విశేషం.

  మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడేలానే

  మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడేలానే

  నిజానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ తేదీ కూడా మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్‌ రెడీ అయింది

  ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్‌ రెడీ అయింది

  మే 20వ తేదీని జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ సినిమాలోని అతడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ బర్త్‌డే రోజు ఇదే విధంగా చేశారు. ఆ పిక్ అదిరిపోయింది. దీంతో ఎన్టీఆర్ పోస్టర్‌ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇది రెడీ అయిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

  మరో బిగ్ సర్‌ప్రైజ్ లోడ్ అవుతుందంటూ

  మరో బిగ్ సర్‌ప్రైజ్ లోడ్ అవుతుందంటూ

  తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ పుట్టినరోజున అతడికి సంబంధించిన పోస్టర్ మాత్రమే రావట్లేదట... RRR మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ఆరోజే ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఇందుకోసం మరో పోస్టర్‌ను కూడా వదలబోతున్నారని తెలిసింది. ఇక, ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌కు వాయిదా పడినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు ప్రకటిస్తారట.

  English summary
  On the Occasion of Jr NTR Birthday... RRR Movie Unit to Planned Release Special Poster of Komaram Bheem and New Release Date will be Reveal
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X