RRR స్పెషల్ షో.. ఆ థియేటర్ కు రాబోతున్న అగ్ర హీరోలు.. స్టార్ దర్శకులు.. ఎప్పుడంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మల్టిస్టారర్ RRR మరికొన్ని గంటల్లో వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలి అని కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది కోసం చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా స్పెషల్ షో లు కూడా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక రోజు ముందుగానే సినీ ప్రముఖుల RRR ప్రీమియర్ షో చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక షోకు ఎవరు రాబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

 గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్, కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతుంది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కానీ స్థాయిలో ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.

సినిమాను చూడాలని ప్రముఖుల ఆసక్తి

సినిమాను చూడాలని ప్రముఖుల ఆసక్తి

RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళికి అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితంగా ఉండే చాలా మంది సినీ ప్రముఖులు మొదటి రోజు కంటే ముందే సినిమాను చూడాలి అని అనుకుంటున్నారు.

ఇప్పటివరకు చూడని హీరోలు

ఇప్పటివరకు చూడని హీరోలు

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గచ్చిబౌలి AMB సినిమాస్ లో ప్రత్యేకంగా ఒక స్క్రీన్ లోని టికెట్లు అన్నిటిని కూడా తన కుటుంబ సభ్యుల కోసం అలాగే సన్నిహితుల కోసం బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కంప్లీట్ గా సినిమాను చూడలేదు. అందరితో పాటే మీరు కూడా చూడాలి అనే రాజమౌళి పెట్టిన కండిషన్ కు ఈ సినిమాను తొందరగా చూడాలి అని ఎదురుచూస్తున్నారు.

స్పెషల్ షో

స్పెషల్ షో


అయితే రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రీమియర్ షోను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రోజు రాత్రి 9 గంటలకే ప్రత్యేకంగా సెలబ్రిటీల కోసం షోను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ ప్రత్యేకమైన షో కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అగ్రహీరోలు దర్శకులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

 రాబోతున్న హీరోలు

రాబోతున్న హీరోలు


ఇక ఎవరెవరు వస్తున్నారు అని వివరాల్లోకి వెళితే ముందుగా మెగాస్టార్ చిరంజీవి అలాగే మహేష్ బాబు ఇద్దరు కూడా ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ రవితేజ హీరో రామ్ పోతినేని కూడా సోను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

దర్శకులు కూడా..

దర్శకులు కూడా..

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖ దర్శకులు కూడా RRR సినిమా చూసేందుకు రెడీ అయినట్లు సమాచారం. అందులో టాలెంటెడ్ దర్శకుడు హరీష్ శంకర్ అనిల్ రావిపూడి కొరటాల శివ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొందరు ప్రముఖ దర్శకుడు కూడా సినిమా చూడబోతున్నట్లు సమాచారం. మరి సినిమా చూసిన తర్వాత వారందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X