రామ్ చరణ్, ఎన్టీఆర్ పాట్నర్స్ గా లాభాలు వచ్చే వ్యాపారం.. చర్చలు జరుపుతున్న బడా సంస్థ?
టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా RRR సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ లో కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకంటే ముందే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక భవిష్యత్తులో కూడా స్నేహం అలానే కొనసాగుతుంది అని ఆ సినిమా ప్రమోషన్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఒక బిజినెస్ చేయడానికి సిద్ధమయ్యే అవకాశం కూడా ఉందట. అందుకోసం ఒక సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాతో మరింత స్నేహంగా..
RRR సినిమా తో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో స్నేహం ఎంతగా బలపడిందో ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలా బాగా అర్థమైంది. దర్శకుడు రాజమౌళి వెండి తెరపై వారిని చూపించిన విధానం ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ చేసింది. ఆప్యాయత బాండింగ్ ఇలా అన్ని రకాల అంశాల్లో వారి స్నేహాన్ని ఆ సినిమా ద్వారా ఛాటి చెప్పారు.

అభిమానుల మధ్యలో..
రియల్ లైఫ్ లో అంతగా ఫ్రెండ్ షిప్ లేకపోతే వెండితెరపై అంత ఎమోషనల్ గా ఆ క్యారెక్టర్స్ ను పండించే వారు కాదు అని కూడా అర్థమైంది. ఏదేమైనా కూడా మెగా అభిమానులు నందమూరి అభిమానులలో కూడా మంచి సాన్నిహిత్యం పెరగడానికి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా ఎంతగానో దోహదపడింది. భవిష్యత్తులో కూడా వారి ప్రయాణం ఇలాగే కొనసాగాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

చరణ్ ఎన్టీఆర్ బిజినెస్?
అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ఒక వ్యాపారం చేయబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. వీరిద్దరిని కలిపేందుకు ఒక సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా వ్యాపారం చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో దర్శకుడు రాజమౌళి షేర్ కూడా ఉంటుంది అని అనిపిస్తుంది.

RRR హోటల్స్?
RRR సినిమాతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకోవడమే కాకుండా జనాల్లో కూడా ఒక మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. అయితే అదే విధంగా RRR టైటిల్ తో కొన్ని రెస్టారెంట్స్ స్టార్ట్ చేయాలని ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఎన్టీఆర్, చరణ్ లను పాట్నర్స్ గా చేసుకోవాలని చూస్తోందట.

మొదట అలా..
RRR అనే టైటిల్ తోనే దేశవ్యాప్తంగా మెయిన్ సిటీస్ లో మొదట కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారట. అయితే అందులో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగమైతే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేరుతుంది అని వారితో కూడా పెట్టుబడులు పెట్టించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

కొనసాగుతున్న చర్చలు?
ఎక్కువ స్థాయిలో లాభాలు వచ్చే విధంగా మొదట తక్కువ ఖర్చుతో రెస్టారెంట్ హోటల్స్ బిజినెస్ ను ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట. ఇది వరకే ఈ విషయం పై ఇద్దరు హీరోలతో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఆ హీరోలు ఈ వ్యాపారం చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి
.


Click it and Unblock the Notifications











