సర్‌ప్రైజ్: RRRలో మరో స్టార్ హీరో! అదిరిపోయేలా జక్కన్న స్కెచ్..

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీగా మరో సినిమా RRR రూపొందిస్తున్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషల సూపర్ స్టార్స్ కనిపించేలా సూపర్బ్ ప్లాన్ వేశారు జక్కన్న. ఈ నేపథ్యంలోనే మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ని కలిశారట దర్శకదీరుడు. ఆ వివరాలేంటో చూద్దామా..

 భారీ మూవీ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్

భారీ మూవీ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి RRR మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ రోల్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై జనాల్లో ఆకాశాన్నంటే ఆశలున్నాయి.

RRR మోషన్ పోస్టర్.. భారీ రెస్పాన్స్

RRR మోషన్ పోస్టర్.. భారీ రెస్పాన్స్

కరోనా ఎఫెక్ట్ కారణంగా తదుపరి షెడ్యూల్స్ వాయిదా వేసిన చిత్రయూనిట్.. ఇటీవలే RRR మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రావడమే గాక.. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి.

రౌద్రం రణం రుధిరం.. భారీ తారాగణం

రౌద్రం రణం రుధిరం.. భారీ తారాగణం

మోషన్ పోస్టర్ ద్వారానే RRR పూర్తి పేరు ''రౌద్రం రణం రుధిరం'' అని ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని ఇలా భారీ తారాగ‌ణం న‌టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ రోల్ కూడా కన్ఫర్మ్ చేశారట రాజమౌళి.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
రాజమౌళి క్లారిటీ.. ప్రేక్షకుల కుతూహలం

రాజమౌళి క్లారిటీ.. ప్రేక్షకుల కుతూహలం

ఈ మేరకు మోహన్ లాల్ ని సంప్రదించిన రాజమౌళి.. పాత్ర విశేషాలు తెలిపారట. అది వినగానే మోహన్ లాల్ ఓకే అనేశారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై రాజమౌళి నుంచి క్లారిటీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఏదిఏమైనా ఈ పాన్ ఇండియా మూవీలో అన్ని భాషల స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకలోకం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X