twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్థిక ఇబ్బందుల్లో RRR.. డబ్బులు లేవని చేతులెత్తేసిన రాజమౌళి టీమ్..?

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతున్న RRRపై గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గతంలో ఎప్పుడు లేని విదంగా రాజమౌళి ఈ సినిమా ద్వారా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకు ముఖ్య కారణం.. కరోనా వైరస్. సినిమా ఆగిపోవడం వలన దాదాపు అన్ని వైవుల నుంచే జక్కన్న సమస్యలను ఏదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సినిమా ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.

     న్యూ షెడ్యూల్ క్యాన్సిల్..

    న్యూ షెడ్యూల్ క్యాన్సిల్..

    RRR కోసం దాదాపు 450కోట్లను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఇంకా మిగిలిన షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇటీవల కొన్ని ప్లాన్స్ వేసుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. తారలు ఎవరు కూడా షూటింగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు.

     చేతులెత్తేసిన రాజమౌళి టీమ్..

    చేతులెత్తేసిన రాజమౌళి టీమ్..

    షూటింగ్ అనుకున్నట్టుగా జరిగితే సినిమాకు పెద్దగా ఇబ్బందులు తలెత్తేవి కావు. అయితే లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సినిమా కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత జీతం ఇస్తున్న ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు సడన్ గా చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఎదో రకంగా హెల్ప్ చేసినప్పటికీ ఇప్పుడు ఏ విధంగా సహాయం చేయడానికి కుదరడం లేదని డైరెక్ట్ గా చెప్పేసిందట.

    రాజమౌళి పెట్టుబడి

    రాజమౌళి పెట్టుబడి

    సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు ప్రొడక్షన్ టీమ్ ని సినిమా పూర్తయ్యే వరకు పెద్దగా చేంజ్ చెయ్యడు. నెలసరి జీతాలు అందిస్తూ సినిమా పూర్తయ్యే వరకు వారికి సపోర్ట్ చేస్తుంటాడు. ఇకపోతే RRR నిర్మాత దానయ్య అయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో రాజమౌళి కూడా ఈన్వెస్ట్ మెంట్ చేసినట్లు అప్పట్లోనే ఒక టాక్ వచ్చింది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    జాగ్రత్తగా ఉండకపోతే..

    జాగ్రత్తగా ఉండకపోతే..

    ఇక ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా కనీసం షూటింగ్స్ కూడా జరగకపోవచ్చని అందుకే RRR వర్కర్స్ కి జీతాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇంకా సినిమాకు ముందు ముందు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ లోనే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలే పాన్ ఇండియా చిత్రం కాబట్టి రిలీజ్ కి ముందు వరకు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టమవుతుంది. అందుకే చిత్ర యూనిట్ పని మొదలయ్యేకే జీతాలు ఇవ్వాలని ఆలోచిస్తోందట.

    English summary
    RRR Producer DVV Danayya gave the final clarity on the film release date. In an interview , said it could not be released in time. The film is expected to be released on January 8, 2021. But due to pending shooting and post-production work, it could not be released in due time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X