For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR అప్‌డేట్: మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్.. ప్లాన్ చేసిన రాజమౌళి.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెం 1' సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. అనతి కాలంలోనే ఎంతో పేరును సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అయినవే. ముఖ్యంగా ఈ మధ్య తీసిన 'బాహుబలి'తో ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో పాటు తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో ఆయన తీసే తర్వాతి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న.. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  ఇండస్ట్రీలోనే భారీ మల్టీస్టారర్ మూవీ

  ఇండస్ట్రీలోనే భారీ మల్టీస్టారర్ మూవీ

  ప్రస్తుతం రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలయికలో RRR అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. వీరి సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

  చాలా వరకు అయింది.. ఇప్పుడే ముఖ్యమైనది

  చాలా వరకు అయింది.. ఇప్పుడే ముఖ్యమైనది

  ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో షూటింగ్ ప్రారంభమై ఏడాది గడిచినా కేవలం డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఇక, మిగిలిన ముప్పై శాతం షూటింగులోనే అత్యంత ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. ఇందులో క్లైమాక్స్ ఫైట్ కూడా ఉంటుందని సమాచారం.

  అనుకున్న సమయానికి కష్టమేనా?

  అనుకున్న సమయానికి కష్టమేనా?

  RRR షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తయిందని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనికి కారణం ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడేమో షూటింగ్ శరవేగంగా జరగకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

   అక్కడ కూడా అంటున్నారు

  అక్కడ కూడా అంటున్నారు

  ఈ సినిమా వాయిదా పడుతుందన్న పుకార్ల వెనుక మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే, బాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల వాళ్లు కనిపించనున్నారు. దీంతో RRRను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడం సహా మొత్తం పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.

  రాజమౌళి తీరుతో ఫ్యాన్స్‌లో నిరాశ

  రాజమౌళి తీరుతో ఫ్యాన్స్‌లో నిరాశ

  ఇద్దరు బడా హీరోలు నటిస్తున్న ఈ సినిమాను ప్రకటించి దాదాపు ఏడాదిన్నర అయిపోయింది. అలాగే, రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయి సంవత్సరం పూర్తయింది. కానీ, ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్ ఒక్కటి కూడా బయటకు రాలేదు. దీంతో జక్కన్న తీరుపై అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్

  మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్

  ఈ సినిమా టైటిల్ ‘RRR' అనేది ఒరిజినల్ టైటిల్ అని.. దీన్ని విస్తరించి ఉప శీర్షికగా ఒక్కో భాషలో ఒక్కోటి పెడతామని గతంలో రాజమౌళి గతంలోనే చెప్పారు. అంతేకాదు, కొన్ని పేర్లు కూడా సూచించాలని కోరారు. దీంతో చాలా మంది కొన్ని టైటిల్స్ పంపారు. వీటిలో ఒక దానిని చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని తాజా సమాచారం. అంతేకాదు, జనవరి 1న దీన్ని రివీల్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

  English summary
  Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on july 30 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X