RRR అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ట్రైలర్ విషయంలో షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం చేస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేవలం సాధారణ ప్రేక్షకుడు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలి అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఒక షాక్ ఇవ్వబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

అంతకుమించి అనేలా..

అంతకుమించి అనేలా..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి మెగా నందమూరి కాంబినేషన్ లో తెరపైకి రాబోతున్న RRR తప్పకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేయడమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ ను కూడా అంతకుమించి అనేలా పెంచుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మరొక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు.

 రేట్లు తగ్గాయి..

రేట్లు తగ్గాయి..

నిర్మాత డి.వి.వి.దానయ్య RRR సినిమా కోసం దాదాపు 450 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఇప్పటికే 900 కోట్లు దాటేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొత్త తరహాలో టిక్కెట్ల రేట్లు రావడంతో కొన్ని ఏరియాల్లో రేట్లను కూడా తగ్గించాల్సి వచ్చింది. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్ పై కొంత చూపించే అవకాశం ఉంది. రాజమౌళి వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడు.

పవర్ఫుల్ పోటీలో RRR

పవర్ఫుల్ పోటీలో RRR

సంక్రాంతి హడావిడిలో తప్పకుండా సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను అందుకుంటుంది అని జనవరి 7 వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి కూడా కొంత పోటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రెండు సినిమాలను దాటి RRR ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ట్రైలర్ వాయిదా?

ట్రైలర్ వాయిదా?

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కొన్ని కారణాల వలన వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీకి ట్రైలర్ రిలీజ్ డేట్ కు కొంత ఎక్కువ గ్యాప్ ఉంది అనే కారణం చేత కూడా ట్రైలర్ ను మరో తేదీన విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Kangana Ranaut బోల్డ్ పోస్ట్... అరెస్టు చెయ్యడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది...! | Filmibeat Telugu
కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక సినిమా విడుదల తేది విషయంలో అయితే ఇలాంటి అనుమానాలు లేవని ఇప్పటికే చిత్ర యూనిట్ పలుమార్లు వివరణ ఇచ్చింది. కానీ ట్రైలర్ విషయంలో టెక్నీకల్ ఇష్యుస్ అని కూడా అంటున్నారు. విడుదల తేదీకి ఇంకా రెండు రోజుల సమయం ఉన్నా కూడా టెక్నీకల్ ఇష్యుస్ ఏమిటని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X