twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR సీక్రెట్ లీక్: ఎన్టీఆర్, చరణ్‌ను కలిపింది బాలీవుడ్ హీరోనే.. రాజమౌళి అదిరిపోయే స్కెచ్.!

    By Manoj
    |

    కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. గతంలో పోలిస్తే ఇప్పుడు హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య ఆలోచనా ధోరణి మారడం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇలాంటి తరుణంలోనే టాలీవుడ్‌లోనే భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఇండస్ట్రీలోనే ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్‌ను కలిపి ఇందులో నటింపజేస్తున్నాడాయన. అసలు వీళ్లిద్దరినీ కలిపింది ఓ బాలీవుడ్ హీరో అని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఎవరా హీరో.? పూర్తి వివరాల్లోకి వెళితే.....

    రియల్ హీరోల కోసం వీళ్లందరూ కలిశారు

    రియల్ హీరోల కోసం వీళ్లందరూ కలిశారు

    స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. చెర్రీ.. అల్లూరిగా, తారక్.. భీంగా నటిస్తున్నారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

    సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాజమౌళి

    సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రాజమౌళి

    ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. దీని నుంచి ఒక్కటంటే ఒక్క సర్‌ప్రైజ్ కూడా రాకపోవడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు రామ్ చరణ్ లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించాడు దర్శకుడు రాజమౌళి.

    ఆ రెండింటి వల్ల ఒక్కసారిగా రెట్టింపయ్యాయి

    ఆ రెండింటి వల్ల ఒక్కసారిగా రెట్టింపయ్యాయి

    RRRకు క్యాప్షన్‌గా మరో టైటిల్ ఉంటుందని రాజమౌళి కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే సినిమా తెరకెక్కుతోన్న ఐదు భాషల్లోనూ క్యాప్షన్ పెట్టి మోషన్ పోస్టర్ పేరుతో ఓ వీడియో వదిలారు. అలాగే, చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మరో వీడియోను విడుదల చేశారు. వీటికి భారీ స్థాయిలో రెస్సాన్స్ రావడంతో పాటు అంచనాలు రెట్టింపు అయిపోయాయి.

    ఎన్టీఆర్, చరణ్‌ను కలిపింది బాలీవుడ్ హీరోనే

    ఎన్టీఆర్, చరణ్‌ను కలిపింది బాలీవుడ్ హీరోనే

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. 1920లో కనిపించకుండా పోయిన అల్లూరి, కొమరం భీంలను కలిపడంతో పాటు అన్ని విద్యలు నేర్పే గురువుగా ఆయన నటిస్తున్నారని సమాచారం.

    Recommended Video

    Bigg Boss Telugu To Telecast As JR NTR Host
    వాళ్లిద్దరి కలయికకు నాంది పడింది అక్కడే

    వాళ్లిద్దరి కలయికకు నాంది పడింది అక్కడే

    1920లో అల్లూరి, కొమరం భీం తమ తమ ఇల్లు వదిలి వెళ్లిపోయారన్నది నిజం. అయితే, అప్పటి నుంచి విప్లవ వీరులుగా వీళ్లు ఎలా మారారన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడదే పాయింట్‌ను బేస్ చేసుకుని రాజమౌళి RRR కథను అల్లాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అక్కడి నుంచి కల్పిత సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

    English summary
    RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and character actor Ajay Devgn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X