పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీకర పోరు.. నందమూరి అభిమానులకు కనువిందే!

Recommended Video

RRR Movie Update : Jr NTR Fight With Real Tiger

RRR సినిమాకు సంబంధించి నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ స్టామినా ఏంటో తెలిసేలా ఏకంగా ఆయన పులితో ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబందించి షూటింగ్ కూడా జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..

RRR సినిమాలో ఎన్టీఆర్

RRR సినిమాలో ఎన్టీఆర్

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్టు RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అలరించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు.

నిజమైన పులితో యంగ్ టైగర్ పోరాటం

నిజమైన పులితో యంగ్ టైగర్ పోరాటం

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు కొమురం భీం లుక్ లోకి మేకోవర్ అయ్యారు ఎన్టీఆర్. అయితే చిత్రంలో ప్రేక్షకులకు కనువిందు చేసేలా నిజమైన పులితో యంగ్ టైగర్ పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.

బల్గేరియాలోని ఓ అడవిలో.. సూపర్ ప్లాన్

బల్గేరియాలోని ఓ అడవిలో.. సూపర్ ప్లాన్

ప్రస్తుతం RRR షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఒక ట్రైన్డ్‌ పులితో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాలని ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఎంతో సహజంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట మేకర్స్. అంతర్జాతీయ స్థాయి ఫైట్‌ మాస్టర్స్‌తో ఈ ఫైట్‌ను డిజైన్‌ చేయించారని టాక్.

భీకర పోరు.. పులితో పోరాడటం అంటే!

భీకర పోరు.. పులితో పోరాడటం అంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, నిజమైన పులి మద్య జరిగే ఈ భీకర పోరును నందమూరి అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పైగా జక్కన్న దర్శకత్వం కాబట్టి ఈ సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయని ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నారు ప్రేక్షకులు. ఏదేమైనా ఓ హీరో పులితో పోరాడటం అంటే మామూలు విషయం కాదు. చూడాలి మరి ఈ సన్నివేశాలు ఎంత రక్తి కట్టిస్తాయో!.

RRR మూవీ

RRR మూవీ

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X