RRR అప్‌డేట్: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చరణ్ విషయంలో రాజమౌళి కీలక నిర్ణయం.!

By Manoj Kumar P

టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్.. ఆయనకు తోడు ఇద్దరు స్టార్ హీరోలు.. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్.. బాలీవుడ్, హాలీవుడ్ నటులు కలగలిపి వస్తున్నదే RRR. 'బాహుబలి' వంటి భారీ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ విషయంలో రాజమౌళి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.!

ఆ ఇద్దరి కథే RRR.. వాళ్లందరూ కలిశారు

ఆ ఇద్దరి కథే RRR.. వాళ్లందరూ కలిశారు

ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న RRR ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగా కనిపించబోతున్నారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ సహా ఎంతో మంది కలిసి నటిస్తున్నారు.

చాలా సమయం అయింది.. అది మాత్రం కాలేదు

చాలా సమయం అయింది.. అది మాత్రం కాలేదు

RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. మిగిలిన భాగంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ పెండింగ్ ఉండిపోయాయి. వీటికితోడు రామ్ చరణ్ చేయాల్సిన పార్ట్ కూడా మిగిలే ఉంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన చిత్రీకరణే జరుగుతోంది.

ముందు అన్నది ఒకటి.. చేసింది మరొకటి

ముందు అన్నది ఒకటి.. చేసింది మరొకటి

వాస్తవానికి ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది. అయితే, దీనిని దాదాపు పది భాషల్లో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఈలోపు సినిమాను జనవరి 8, 2021కి వాయిదా వేయడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.

 రాజమౌళిపై కారాలు మిరియాలు నూరుతున్నారు

రాజమౌళిపై కారాలు మిరియాలు నూరుతున్నారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదైన ఒక సర్‌ప్రైజ్ వస్తుందని ఆశతో ఉన్నారు. కానీ, రాజమౌళి అటువంటి ప్రయత్నం ఏదీ చేయకపోవడంతో వాళ్లంతా ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

RRR అప్‌డేట్: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

RRR అప్‌డేట్: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' మూవీ కోసం రామ్ చరణ్.. RRR షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నాడు. ఈ మధ్యనే తన పార్ట్‌కు సంబంధించిన షూట్‌లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 27న చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తలో నిజం లేదని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

చరణ్ విషయంలో రాజమౌళి కీలక నిర్ణయం.!

చరణ్ విషయంలో రాజమౌళి కీలక నిర్ణయం.!

రామ్ చరణ్ పుట్టినరోజున RRR నుంచి సర్‌ప్రైజ్ వస్తుందని ఆశలు పడ్డ మెగా అభిమానులకు రాజమౌళి షాక్ ఇవ్వబోతున్నాడట. సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నందున ఇద్దరు హీరోల లుక్‌ను అప్పుడే రివీల్ చేయకూడదని జక్కన్న భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్‌ చేసేది అల్లూరి రోల్ కావడంతో దానిపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X