RRR అప్‌డేట్: ఎన్టీఆర్ డేరింగ్ స్టెప్‌తో మారిన సీన్.. రాజమౌళి కూడా ఒప్పుకోక తప్పలేదు
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ డేరింగ్ డెసీషన్ తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంతులేంటో మీరూ చూడండి.!

రియల్ హీరోల స్టోరీతో వస్తుంది
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. 19వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన కొన్ని యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సహా ఎన్నో ఇండస్ట్రీల నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అప్పుడే రావాల్సింది.. మారింది
2020, జూలై 30 ఈ సినిమా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, హీరోలు గాయపడడం, పరిస్థితులు అనుకూలించకపోవడం సహా పలు అనివార్య కారణాల వల్ల ఇది కాస్తా జనవరి 8, 2021కి వాయిదా పడింది. ఇక, ఈ ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో పలుమార్లు ఆటంకం ఏర్పడింది.

రెండింటికీ అదిరిపోయే రెస్పాన్స్
ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో విడుదలైన రామ్ చరణ్ ఎంట్రీ వీడియో, ఈ మధ్య వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ రెండు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాయి.

ఆ భయంతో హీరోల వెనుకడుగు
కొద్ది నెలలుగా భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడిపోయాయి. మరీ ముఖ్యంగా తెలుగులో పెద్ద హీరోలెవరూ షూటింగ్‌లలో పాల్గొనడం లేదు. ఈ మధ్య కరోనా ప్రభావం కొంత తగ్గడంతో ఇప్పుడిప్పుడే ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో RRR షూటింగ్ కూడా షురూ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ డేరింగ్ డెసీషన్
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల విదేశాలకు వెళ్లి, బుధవారమే హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అతడు నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇదే విషయం జక్కన్నకు కూడా చెప్పాడట. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా తారక్ పార్ట్‌ను పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Recommended Video

రాజమౌళి కూడా అదే స్పీడుతో..
క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్ షూటింగ్ చేయడానికి ముందుకు రావడంతో, ఎలాగైనా సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. అందుకోసం ఈ శుక్రవారం (నవంబర్ 20) నుంచి షూటింగ్ పున: ప్రారంభించాలని డిసైడ్ అయిపోయారని తాజా సమాచారం. దీని తర్వాత రామ్ చరణ్ పార్ట్ కూడా కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











