రాంచరణ్, ఆలియా రొమాన్స్ అక్కడే... ఎన్టీఆర్ ఎంట్రీ దిమ్మతిరిగేలా.. RRRకుమరో బ్రేక్

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌తో రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, ఆలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్‌కు జంటగా ఆలియా భట్ నటిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరిపై సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ సీన్లను ఎక్కడ షూట్ చేయనున్నారంటే..

 40 శాతం షూటింగ్ పూర్తి

40 శాతం షూటింగ్ పూర్తి

RRR సినిమా దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తియింది. ప్రధానంగా రాంచరణ్, ఎన్టీఆర్‌పై భారీగా సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ గుజరాత్, హైదరాబాద్‌లో జరుగుతున్నది. త్వరలోనే ఆహ్మాదాబాద్‌, పూణేలో జరిగే షూట్‌కు ఆలియాభట్ హాజరవుతారు అని బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

గ్రామీణ యువతిగా ఆలియా భట్

గ్రామీణ యువతిగా ఆలియా భట్

ఆహ్మదాబాద్, పూణేలో జరిగే షెడ్యూల్‌లో ముఖ్యంగా రాంచరణ్, ఆలియాభట్‌పై సీన్లను షూట్ చేయడానికి ప్లాన్చేశారు. 1900 కాలం నాటి గ్రామీణ యువతి గెటప్‌లో ఆలియాభట్ కనిపిస్తుంది అని బాలీవుడ్ పత్రిక పేర్కొన్నది. ఇప్పటికే ఆలియాపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సింది. అయితే చెప్పపెట్టకుండా ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో విదేశాలకు వెళ్లి రాజమౌళికి షాకిచ్చారనే వార్త మనకు తెలిసిందే.

 విదేశాలకు ఎస్ఎస్ రాజమౌళి

విదేశాలకు ఎస్ఎస్ రాజమౌళి

ఆహ్మాదాబాద్, పూణెలో 15 రోజులపాటు జరిగే షెడ్యూల్ అనంతరం RRR సినిమా షూట్‌కు కొంత విరామం ప్రకటించనున్నారట. రాజమౌళి విదేశాలకు వెళ్లనున్నడంతో RRR షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాశం ఉంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు బ్రేక్ ఇచ్చి వారి వారి ఫ్యామిలీలతో గడిపేందుకు వెసలుబాటు కలిగించినట్టు సమాచారం.

రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీలకు భారీగా

రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీలకు భారీగా

ఇక రాంచరణ్‌కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్లను భారీగా చిత్రకరించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌ ఎంట్రీకి సంబంధించిన సీన్లను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రాంచరణ్‌కు ఎంట్రీ సీన్‌కు రూ.10 కోట్లు ఖర్చు చేయగా, జూనియర్ ఎంట్రీ సీన్‌కు 15 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాంచరణ్‌కు తండ్రిగా అజయ్ దేవగణ్ నటిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X