For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR అప్‌డేట్: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. మొదటి సర్‌ప్రైజ్‌కు ముహూర్తం ఫిక్స్.!

  By Manoj Kumar P
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎన్నో హంగులతో తెరకెక్కుతోన్న చిత్రం RRR. 'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.!

  ఇద్దరి కలయికతో వాళ్లంతా ఒక్కటయ్యారు

  ఇద్దరి కలయికతో వాళ్లంతా ఒక్కటయ్యారు

  రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నందమూరి హీరో ఎన్టీఆర్‌తో కలిసి మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్ నటిస్తున్నాడు. దీంతో ఈ రెండు కుటుంబాల అభిమానులు కూడా ఒక్కటైపోయారు. ఇప్పటి వరకు తమ తమ హీరోల కోసం పోటా పోటీగా ప్రచారాలు చేసుకున్న వాళ్లంతా.. RRR కోసం కలిసి మెలసి ఉంటున్నారు. ఇద్దరు హీరోలకు మద్దతు తెలుపుతున్నారు.

  అలా కనిపించడానికి రామ్ చరణ్ ప్లాన్

  అలా కనిపించడానికి రామ్ చరణ్ ప్లాన్

  ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇందుకోసం అతడు సరికొత్త లుక్కుతో దర్శనమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం కొద్ది రోజులుగా కోరమీసంతో కనిపిస్తున్నాడీ మెగా హీరో. అంతేకాదు, ఫిజిక్ విషయంలోనూ పక్కాగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం జిమ్‌లో రోజూ గంటల తరబడి సరైన కసరత్తులు చేస్తున్నాడు.

   తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలని గ్యాప్ తీసుకున్నాడు

  తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలని గ్యాప్ తీసుకున్నాడు

  రామ్ చరణ్ RRR షూటింగ్‌కు చాలా రోజుల పాటు బ్రేక్ ఇచ్చాడు. దీనికి కారణం.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' సినిమా కోసమే. ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన చెర్రీ.. దాన్ని ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు షూటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో అతడి పార్ట్‌ను పక్కన పెట్టి మిగిలిన భాగం షూట్ చేశారు.

  ఆ విషయంలో రాజమౌళిపై వాళ్లంతా ఫైర్

  ఆ విషయంలో రాజమౌళిపై వాళ్లంతా ఫైర్

  RRR సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది దాటిపోయింది. సినిమా షూటింగ్ కూడా డెబ్బై శాతం పూర్తయింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి పోస్టర్ గానీ, ఫస్ట్ లుక్స్ గానీ, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ఏదీ వదలలేదు. దీంతో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నందమూరి, మెగా ఫ్యాన్స్ దర్శకుడు రాజమౌళిపై ఫైర్ అవుతున్నారు.

  మొదటి సర్‌ప్రైజ్‌కు ముహూర్తం ఫిక్స్.!

  మొదటి సర్‌ప్రైజ్‌కు ముహూర్తం ఫిక్స్.!

  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. RRRలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. మెగా హీరో చరణ్ పుట్టినరోజైన మార్చి 27నే మొదటి సర్‌ప్రైజ్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  Ram Charan & Jr NTR Special Pic With Ajay Devgn | RRR | SS Rajamouli
  RRR నేపథ్యం.. ముందుది మార్చేశారు

  RRR నేపథ్యం.. ముందుది మార్చేశారు

  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లు. అలాగే, అజయ్ దేవగణ్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, రాహుల్ రామకృష్ణ సహా ఎంతో మంది నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన తేదీన కాకుండా దీన్ని 2021, జనవరి 8న విడుదల చేయనున్నారు.

  English summary
  Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. Hollywood actress Emma Roberts rejects Rajamouli offer for RRR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X