RRR Vs Radhe shyam రాజమౌళి రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ప్రభాస్.. సంక్రాంతికి అమీతుమీ!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య అనుబంధం ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ అంటూ ప్రభాస్‌ను రాజమౌళి పిలిస్తే.. జక్కన్న అంటూ మర్యాదపూర్వకంగా ప్రభాస్ సంబోధిస్తాడు. ప్రభాస్‌కు ఓ ఇమేజ్, దేశవ్యాప్తంగా పాపులారిటిని కల్పించిందెవరంటే రాజమౌళి అంటూ ఠక్కున చెబుతారు. అయితే ఇలాంటి రిలేషన్‌షిప్ ఉన్న ప్రభాస్ తన అభిమాన దర్శకుడు రాజమౌళి కోరికను తిరస్కరించారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే...

ఛత్రపతితో రాజమౌళి, ప్రభాస్

ఛత్రపతితో రాజమౌళి, ప్రభాస్

ఛత్రపతి చిత్రంతో రాజమౌళి తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా ప్రభాస్‌ పాపులారిటిని నెక్ట్స్ లెవెల్‌కు చేర్చాడు. ఇక బాహుబలితో ఈ ఇద్దరు చేసిన మ్యాజిక్ ఇక మాటల్లో చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా భాష భేదం లేకుండా ఈ ఇద్దరు రూపొందించి చిత్రం బాహుబలిని హృదయాల్లో చేర్చుకొన్నారు.

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా

ఇక బాహుబలి తర్వాత రాజమౌళి RRR మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్‌ను కలిపి దేశంలోనే ఎవరూ ఊహించని విధంగా మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనావైరస్ కారణంగా వరుస లాక్‌డౌన్స్ రావడంతో ఈ సినిమా వాయిదాలు పడుతూ ముందుకెళ్తున్నది.

సంక్రాంతి బరిలో రాధే శ్యామ్

సంక్రాంతి బరిలో రాధే శ్యామ్

బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉత్తరాదిలో సాహోను ప్రేక్షకుల ఆదరిస్తే.. దక్షిణాదిలో ఈ చిత్రంపై పెదవి విరిచాడు. అయితే ఆ సినిమాకు మంచి మరో సినిమాను చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో ముందుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్డే, రాధాకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి బరిలో దూకేందుకు సిద్ధమైంది.

RRRకు ముందే తెలియజేసి..

RRRకు ముందే తెలియజేసి..

అయితే రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే తమ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించుతున్నామని, RRR చిత్ర యూనిట్‌కు ముందే తెలియజేశారట. అయితే తాము అక్టోబర్‌లోనే రిలీజ్ చేస్తున్నామని వారు స్పష్టం చేయడంతో రాధేశ్యామ్‌ను సంక్రాంతి బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.

రాజమౌళి ప్రతిపాదనకు రాధేశ్యామ్ టీమ్ తిరస్కారం

రాజమౌళి ప్రతిపాదనకు రాధేశ్యామ్ టీమ్ తిరస్కారం

అయితే ఎవరూ ఊహించని విధంగా RRR మూవీ రిలీజ్‌ను వాయిదా వేయడం అందర్ని ఆశ్చర్యం కలిగించింది. అయితే RRR చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం. మీ రాధేశ్యామ్‌ విడుదల వాయిదా వేసుకోమని ఓ కీలక వ్యక్తిని రాజమౌళి యూవీ క్రియేషన్ ఆఫీస్‌కు రాయబారం పంపారట. అయితే ప్రభాస్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత RRR కోసం రాధేశ్యామ్‌ రిలీజ్ వాయిదా వేసుకోమని చెప్పారట. దాంతో చేసేదేమీ లేక రాజమౌళి టీమ్‌కు సంబంధించిన ఆ కీలక వ్యక్తి వెనుదిరిగారు అనేది తాజా సమాచారం.

Recommended Video

Victory Venkatesh Launched Poni Poni Song From Natyam Movie
సంక్రాంతి బరిలో RRR

సంక్రాంతి బరిలో RRR

అయితే సంక్రాంతి బరిలోనే RRR సినిమాను దించాలని రాజమౌళి, దానయ్య వర్గం డిసైడ్ అయింది. త్వరలోనే అధికారికంగా సినిమాను రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు యూనిట్ సిద్దమవుతున్నది. అయితే రాజమౌళి రిక్వెస్ట్‌ను ప్రభాస్ తిరస్కరించారనే విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X