రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విడుదల తేదీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రం గురించి సినీవర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఇది. సినీవర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలే తప్ప ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం విడుదల గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది.

Recommended Video

One More Interesting News About RRR Movie Story
 నవంబర్ నుంచి

నవంబర్ నుంచి

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచరణ్ బోయపాటి చిత్రంతో, అరవింద సమేత చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

2020 సంక్రాంతి

2020 సంక్రాంతి

భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా పక్కాగా సిద్ధం చేసుకుని షూటింగ్ అనుకున్న టైంకి పూర్తిచేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నారట.

200 కోట్ల భారీ బడ్జెట్

200 కోట్ల భారీ బడ్జెట్

ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందనుంది. బాహుబలి రెండు భాగాలకు కలిపి రాజమౌళి 200 కోట్లకు పైగా ఖర్చుచేశారు. కానీ ఈ చిత్రం ఒక్కదానికే 200 కోట్లు వెచ్చిస్తుండడంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాహుబలి స్థాయిని మించేలా ఈ చిత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బలమైన కథతో

బలమైన కథతో

ఈ చిత్ర స్థాయికి తగ్గట్లుగా రాజమౌళి బలమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రాంచరణ్ అన్నదమ్ములుగా నటిస్తారని కూడా ఓ వినికిడి. త్వరలో ఏ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియనున్నాయి. డిడివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X