రామ్ చరణ్, శంకర్ పాన్ ఇండియా.. డైలాగ్స్ రాయబోతున్న నెంబర్ వన్ రైటర్

ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్, రామ్ చరణ్ తో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా శంకర్ మొదటి సారి తెలుగు హీరోతో సినిమా చేస్తుండడంతో ఒక్కసారిగా సౌత్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక శంకర్ కూడా ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

అంచనాలు ఈజీగా పెరిగిపోతాయి

అంచనాలు ఈజీగా పెరిగిపోతాయి

RRR తప్పకుండా నేషనల్ లెవెల్లో హిట్టవ్వడం పక్కా. ఇక ఆ తరువాత రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాలపై కూడా అంచనాలు ఈజీగా పెరిగిపోతాయి. శంకర్ - రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో సినిమా రానుందని ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రాజెక్ట్ కు సంబంధించిన రూమర్స్ ఎన్నో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ విషయంలో చర్చలు

హీరోయిన్ విషయంలో చర్చలు

అయితే సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కీయరా అద్వానీ అంటూ పలు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విదేశీ భామల పేర్లు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పెట్టాలని నిర్మాత దిల్ రాజు శంకర్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మాటలు రాయనున్న RRR రైటర్

మాటలు రాయనున్న RRR రైటర్

ఇక లేటెస్ట్ గా సినిమాకు మాటలు రాయడానికి తెలుగు రైటర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు సాయి మాధవ్ బుర్ర. క్రిష్ సినిమాలకు దాదాపు ఆయనే అన్ని డైలాగ్స్ రాస్తుంటారు. గౌతమిపుత్ర శతకర్ణి, మహానటి వంటి సినిమాల అనంతరం సాయి మాధవ్ కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం ఉన్న రైటర్స్ లలో ఆయనే టాప్ లో ఉన్నారు. ఆయన పనితనాన్ని మెచ్చి రాజమౌళి కూడా RRRకు డైలాగ్ రైటర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక శంకర్ కూడా రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు సాయి మాధవ్ ను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

మ్యూజిక్ ఎవరంటే?

మ్యూజిక్ ఎవరంటే?

ఇక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మొదట ఏఆర్.రెహమాన్ అని టాక్ వచ్చింది. కానీ ఇండియన్ 2కు అనిరుద్ ను సెలెక్ట్ చేసుకున్న శంకర్ ఆ సినిమా ఆగిపోవడంతో మళ్ళీ అనిరుద్ ను చరణ్ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. దేవిశ్రీప్రసాద్ కూడా రెండు పాటలు కంపోజ్ చేయవచ్చని ఒక రూమర్ అయితే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X