twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కి పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చారా?

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్ కి నిర్మాతగా మారిన గణేష్ బాబుది కోట్ల అడ్వాన్స్ చెక్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తాను మొదట కమిట్ అయిన ప్రాజెక్టులు ఫినిష్ చేద్దామన్నా గణేష్ కాదని ఈ చెక్ ఇచ్చి ఒప్పించాడని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుల డైరక్టర్స్ శ్రీను వైట్ల, పూరీ జగన్ అని తెలుస్తోంది. అయితే గణేష్ బాబుకి తాను కేవలం ఒక సినిమా మాత్రమే చేయగలనని ఎన్టీఆర్ అన్నాడని చెప్తున్నారు. కానీ శ్రీను వైట్ల, పూరీ జగన్ ఇద్దరూ కలసి తమ స్టోరీ లైన్ లు చెప్పి ఒప్పించటంతో తప్పలేదని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా సురేంద్ర రెడ్డితో చేస్తున్న ఊసరవెల్లి సినిమాపైనే దృష్టి పెట్టి ఉన్నాడు. పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్‌ప్లే ప్రధానాకర్షణలు అంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్.

    'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

    English summary
    Jr Ntr got a cheque of Rs 10 crores for advance from the actor turned producer Ganesh Babu. Producer Ganesh wants to make two films with Jr Ntr in 2012, one will be directed by Srinu Vytla and another film with Puri Jagannath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X