Chiru 156: చిరంజీవి మూవీ నుంచి షాకింగ్ న్యూస్.. ఆ ఒక్క దానికే 100 కోట్లా!
ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తనదైన రీతిలో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా చేస్తున్నారు. అయితే, 'వాల్తేరు వీరయ్య' మినహా ఆయన పెద్ద సక్సెస్‌లను సొంతం చేసుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో కనిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాను కల్యాణ్ కృష్ణతో ప్రకటించారు. కానీ, అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్టును 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. ఈ కాంబోపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు ఇప్పటికే లీక్ చేశారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాదిరిగా ఉండబోతుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అంతేకాదు, హీరో మూడు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడని అంటున్నారు. అలా ఆయా లోకాలకు వెళ్లిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. అందుకే దీనికి ఏకంగా రూ. 200 కోట్లు మేర బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా రూ. 100 కోట్లు పెడుతున్నారట. అంతలా ఈ సినిమా మొత్తంలో 70 శాతం గ్రాఫిక్స్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకున్నారట. అలాగే, విలన్‌గా దగ్గుబాటి రానాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. వీళ్లతో పాటు మరికొందరు హీరోయిన్లు, ఫేమస్ యాక్టర్లు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











