»   » రెండు కోట్లు బెట్... ఎక్కువేం కాదు

రెండు కోట్లు బెట్... ఎక్కువేం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయి ధరమ్ తేజ రోజు రోజుకూ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తొలి సినిమా రేయ్ ..ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత కుర్రాడు వెను తిరిగి చూసుకోలేదు. దానికి తోడు యంగ్ డైరక్టర్స్ అందరూ సాయి ధరమ్ తేజనే ఆప్షన్ గా పెట్టుకోవటం కూడా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ తాజా చిత్రం సుప్రీమ్ కు..గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రెండు కోట్లు కు వెళ్లాయని సమాచారం. గుంటూరు ఏరియాకు రెండు కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ వార్త విన్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. అయితే రెండు కోట్లు పెట్టి తీసుకున్న వాళ్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


Rs 2 Crore for Sai Dharam Tej!

వాళ్లు చెప్పేదాని ప్రకారం సాయి ధరమ్ తేజ ఎబోవ్ యావరేజ్ చిత్రం కూడా 18 కోట్లు పైగా షేర్ తెచ్చి పెట్టింది. దాంతో ఇరవై కోట్లు పెట్టి తీసినా నష్టం లేదని అంటున్నారు. కంటెంట్ బలంగా ఉంటే దూసుకుపోతుందని నమ్మకంగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మాస్ లోకి బాగా దూసుకువెళ్లిన హీరో ఎవరూ అంటే సాయి ధరమ్ తేజే అని చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉండటంతో సాయి ధరమ్ తేజ కు తిరుగులేదు.

Read more about: sai dharam tej
English summary
Distribution rights of 'Supreme' for Gunter territory have been sold out for as big as Rs 2 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu