అల్లు అర్జున్ 'బద్రీనాధ్' సెట్ ఖర్చు ఓ రేంజిలో...
అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్ కోసం కులూమనాలిలో భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెట్ కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే వార్త అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో బదిరీనాధ్ గుడి సెట్ ను సెట్ వేసారు. సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ ఇందులోనే జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు అవరై రోజులు పాటు రెండు షెడ్యూల్ లలో ఆ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ డేస్ లో దాదాపు నలభైరోజులు ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ (పీరియడ్ డ్రామా)కే సరిపోతుందంటున్నారు. అప్పటి జరిగిన కథకు ఈ కాలానికి లింక్ వేసే సన్నివేసాలుకు ఇరవై రోజులు కేటాయిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి దాదాపు నలభై కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని, గ్రాఫిక్స్ అవీ ఫుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే హ్యాపీడేస్ భామ తమన్నా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందిస్తున్నారు. చిన్ని కృష్ణ గతంలో నరసింహనాయుడు, గంగోత్రి, ఇంద్ర వంటి చిత్రాలుకు కథలు అందించారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మగధీర రికార్డులను బ్రద్దలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఈ సినిమాకి కథ: చిన్నికృష్ణ, మాటలు: రాజేంద్రకుమార్, రచనా సహకారం: విస్సు, ఛాయాగ్రహణం: రవివర్మ, సంగీతం: కీరవాణి.


Click it and Unblock the Notifications











