‘సాహో’కు అక్కడ పర్మిషన్ రిజెక్ట్?.. అందుకే రూ. 20 కోట్లతో సెట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సాహో' తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది. దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో యూవి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా నిర్మిస్తోంది.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే అబుదాబిలో రూ. 90 కోట్ల ఖర్చుతో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించి చిత్ర బృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పెద్ద సెట్ వేస్తున్నారట.

అక్కడ పర్మిషన్ రిజక్ట్, అందుకే...
హీరో ప్రభాస్, విలన్ నీల్ నితిన్ ముఖేష్‌లపై ముంబైలోని... బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ మీద భారీ యాక్షన్ సీన్లు ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ షూటింగుకు అనుమతి లభించక పోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ నమూనా సెట్ వేయాలని నిర్ణయించారట.

రూ. 20 కోట్ల ఖర్చు..
దాదాపు రూ. 20 కోట్ల ఖర్చుతో బాంద్రా-వర్లీ సీ లింక్ బ్రిడ్జ్‌ను పోలి ఉండే సెట్ సాబు సిరీల్ ఆధ్వర్యంలో వేయబోతున్నారని సమాచారం. ఇంత భారీ ఖర్చుతో సెట్ వేస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. సినిమాలో కీలకమైన సీన్ కాబట్టే ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతున్నారట.

ఎవరి ఊహకు అందడం లేదు
‘సాహో' సినిమా స్థాయి ఎలా ఉంటుందనేది ఎవరి ఊహకు అందడం లేదు. 300 కోట్ల బడ్జెట్, అందులోనూ రూ. 100 కోట్లకు పైగా కేవలం యాక్షన్ సీన్లకే ఖర్చు పెడుతుండటంతో హాలివుడ్ రేంజి సినిమా చూపిస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

సాహో
‘సాహో' షూటింగ్ కూడా అనుకున్న సమయం కంటే ఎక్కువే తీసుకుంటోంది. దీంతో రిలీజ్ డేట్ కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫైనల్ చేశారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











