ప్రభాస్ సినిమా నుంచి షాకింగ్ న్యూస్: అదొక్కదానికే రూ. 200 కోట్లు ఖర్చు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను ప్రకటిస్తూ తన హవాను చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే.. ప్రశాంత్ నీల్‌తో 'సలార్', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్' సినిమాలను మొదలు పెట్టేశాడు. వీటితో పాటు ప్రభాస్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించే చిత్రం ఉంది. వాస్తవానికి ఎప్పుడో ప్రకటించినా.. ఇంకా మొదలెట్టలేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించబోయే చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌తో రాబోతుందని స్వయంగా చిత్ర యూనిటే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే రూ. 200 కోట్లను కేటాయించారట. సైన్స్ ఫిక్సన్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌దే ఎక్కువ భాగం ఉంటుంది. అందుకే గ్రీన్ మ్యాట్ షాట్స్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ బడ్జెట్‌తోనే ఓ పాన్ ఇండియా సినిమా తీసేయొచ్చు.

Rs 200 Crore Budget for Prabhas Nag Ashwin Movie VFX Work

ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వీళ్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X