మహేష్ బాబుకు రూ. 22.5 కోట్ల ఆఫర్?
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ప్రేక్షకులు అమితంగా ఇష్ట పడే హీరో కూడా కావడంతో పెద్ద నిర్మాతలు ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి భారీ లాభాలు రాబట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సార్లు మహేష్ బాబు సినిమాలు అంచనాలను అందుకోక పోయినప్పటికీ.....మహేష్ బాబు ట్రాక్ రికార్డు దృష్ట్యా నిర్మాతల్లో ఆయనతో భారీ సినిమాలు చేయాలనే ఆసక్తి మాత్రం అలానే ఉంటోంది.
తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూ. 22.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రెమ్యూనరేషనే ఈ రేంజిలో ఉంటే ఇక సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్ బాబు, వివి వినాయక్ కాంబినేషన్లో దానయ్య ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వివరాలు కేవలం రూమర్లుగానే ప్రచారం జరుగుతున్నాయి. అన్ని ఓకే అయితే త్వరలో అఫీషియల్‌గా వెల్లడయ్యే అవకాశం ఉంది. వినాయక్ కూడా చాలా కాలంగా మహేష్ బాబుతో సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ ఎంపికయింది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











