నాగచైతన్యపై పాతిక కోట్లా?

ఇక ఈ చిత్రంలో జె.డి చక్రవర్తి విలన్ గా చేస్తున్నాడని,వాళ్ళిద్దరు మధ్యా వచ్చే సన్నివేశాలు చాలా టెన్స్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే నాగార్జున ఎంత ఖర్ఛు అయినా ఫరవాలేదని..తాను భరిస్తానని తన కొడుకుని గ్రాండ్ గా పరిచయం చేయమని అన్నారని అందుకే ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు డబ్బుని మంచి నీటి ప్రాయంగా ఖర్చుపెడుతూ భారీగా షూటింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో టబు ఓ ఐటం సాంగ్ లో కనిపించనుందనే గుసగుసలు అంతటా వినపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వాసు వర్మ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. కాలేజి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో యాక్షన్,రొమాన్స్ మెయిన్ గా ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











