ఆంజనేయులు దర్శకుడి 25 లక్షల తలనొప్పి
యువత చిత్రంతో పరిచయమైన పరుశరామ్ ఆ వెంటనే రవితేజని ఒప్పించి ఆంజనేయులు సినిమా ప్రారంభించటంతో పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతనికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చి నిర్మాతలు చుట్టముట్టడం ప్రారంభించారు. అయితే తన రెమ్యునేషన్ కోట్లలో చెప్పటంతో అంతా పరారయిపోయారు. అయితే ఛత్రపతి తీసిన ప్రసాద్ మాత్రం రెండు కోట్లకు దాన్ని ఫిక్స్ చేసి ఓ పాతిక లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇంతలో ఆంజనేయులు రిలీజైంది. సీన్ రివర్స్ అయింది. ఫ్లాఫ్ దెబ్బకు ఎవరూ దగ్గరకు రాలేదు. కానీ తను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటూ ప్రసాద్ కనపడ్డారు. దాంతో దర్శకుడుకి దిమ్మతిరిగినట్లయింది. ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వబడవు అనే పాత పాఠం వల్లిస్తున్నాడు. అయితే ఆయన మరింత ముందుకెళ్ళి పూరీ జగన్నాధ్ తో చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అది కనక జరిగితే పూరీ శిష్యుడు,బంధువు అయిన పరుశరామ్ తన పర్సు తీసు పాతిక లక్షలు కట్టాల్సిందే అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











