RC15: రామ్ చరణ్ సినిమాలో నాలుగు నిమిషాలకు 40 కోట్లు.. శంకర్ దెబ్బకు టాలీవుడ్ షాక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న చెర్రీ.. ఇకపై వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు చిత్రాలు విడుదల కాకముందే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రెండు చిత్రాలను పూర్తి చేసిన చెర్రీ

రెండు చిత్రాలను పూర్తి చేసిన చెర్రీ

'వినయ విధేయ రామ' తర్వాత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా చేస్తున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ చరణ్ కీలక పాత్రను పోషించాడు.

దిగ్గజ దర్శకుడితో చెర్రీ క్రేజీ ప్రాజెక్ట్

దిగ్గజ దర్శకుడితో చెర్రీ క్రేజీ ప్రాజెక్ట్

RRR, ఆచార్య తర్వాత మెగా పవర్ స్టార్ చేయబోయే సినిమా గురించి చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ రేంజ్‌లో తెరకెక్కబోతుంది.

వాళ్లంతా భాగం.. అవన్నీ పూర్తి చేసి

వాళ్లంతా భాగం.. అవన్నీ పూర్తి చేసి


శంకర్ సినిమా అంటే చాలా ఏళ్లు చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటుంది. అయితే, చరణ్‌తో చేసే సినిమా కోసం మాత్రం ఆయన అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అలాగే, ప్రారంభానికి ముందే కాస్టింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే దీని కోసంజయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి వాళ్లను ఎంపిక చేశారు. అలాగే, థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకున్నారు.

 భారీగా ప్రారంభం.. మొదటిది పూర్తి

భారీగా ప్రారంభం.. మొదటిది పూర్తి

రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయింది. ఇక, ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసేసుకుంది.

 హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు

హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హైరేంజ్‌లో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ కూడా పూర్తిగా సహకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో రెండో షెడ్యూల్‌లో భాగంగా హీరో, హీరోయిన్లపై రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

నాలుగు నిమిషాలకు 40 కోట్లు ఖర్చు

నాలుగు నిమిషాలకు 40 కోట్లు ఖర్చు

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలోని ఓ పాట కోసం రూ. 40 కోట్ల సెట్ నిర్మిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. హైదారబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీన్ని నిర్మిస్తున్నారట. శివాజీ సినిమాలో వాజీ వాజీ అనే పాటను పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక, ఒక్క పాటకే ఇంత ఖర్చు చేస్తుండడంపై టాలీవుడ్‌లోని పెద్దలంతా షాక్ అవుతున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X