twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ బడ్జెట్లో విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు ఎంతో తెలుసా?

    |

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' తర్వాత భారతీయ సినిమా సాంకేతికంగా మరింత అప్డేట్ అవ్వడం తప్పనిసరి అయింది. అందుకే కథతో పాటు విజువలైజేషన్ విషయంలో కూడా ప్రత్యేకశ్రద్ద పెడుతున్నారు ఫిల్మ్ మేకర్స్.

    కొన్ని కథలు తెరపై బాగా పండాలంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలకం. అందుకే కాస్త బడ్జెట్ ఎక్కువైనా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు వెనకావడటం లేదు. ఇటీవల విడుదలైన 'సాహో' విజువల్ ఎఫెక్ట్స్ కోసమే భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

    విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా... సైరా

    విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా... సైరా

    త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి'. 18వ శతాబ్దం కాలంలో జరిగిన కథ కావడంతో అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడానికి భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా అవసరం కావడంతో అందుకు తగిన విధంగా సిద్ధమయ్యే నిర్మాణం మొదలు పెట్టారు నిర్మాత రామ్ చరణ్.

    రూ. 45 కోట్లు అందుకోసమే ఖర్చు?

    రూ. 45 కోట్లు అందుకోసమే ఖర్చు?

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రంలో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ. 45 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 17 స్టూడియోలు పని చేసినట్లు తెలుస్తోంది. రేపు సినిమా విడుదలైన తర్వాత విజువల్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారట.

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

    బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి' దర్శకత్వం చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇలా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా దీన్ని విడుదల చేస్తున్నారు.

    సైరా

    సైరా

    సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

    భారీగా బడ్జెట్, బిజినెస్ కూడా అదే స్థాయిలో

    భారీగా బడ్జెట్, బిజినెస్ కూడా అదే స్థాయిలో

    ‘సైరా నరసింహారెడ్డి' మూవీ కోసం దాదాపు రూ. 270 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ కావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్సే దాదాపు రూ. 110 కోట్లకుపైగా ధరకు అమ్ముడయ్యాయి. ఇంకా హిందీ, తమిళం, ఇతర భాషల్లో థియేట్రికల్ రైట్స్, డిజిటిల్, శాటిలైట్, ఇతర రైట్స్ అన్నీ కలిపి నిర్మాతలకు భారీగా ఆదాయం ఉంటుందని అంచనా.

    English summary
    It is rumoured that Ram Charan's Konidela Production Company has spent about Rs 45 crore just for the visual effects of the Sye Raa Narasimha Reddy. About 17 studios were involved in creating the VFX portions of this Period film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X