షాకిస్తున్న వరుణ్ సందేశ్ చిత్రం బడ్జెట్

By Srikanya

హైదరాబాద్: వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'సరదాగా అమ్మాయితో'. ఈ చిత్రం బడ్జెట్ ఎనిమిది కోట్లు దాటిందని ఫిల్మ్ నగర్ సమాచారం. వరస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ సందేశ్ మీద ఆ రేంజి బడ్జెట్ పెడితే ఎంత వరకూ వర్కవుట్ అవుతుందంటున్నారు. ఎంత పెద్ద హిట్టైనా...ఐదు కోట్లు దాటి రెవిన్యూ రాదని లెక్కలు చెప్తున్నారు.

కుమార స్వామి ప్రొడక్షన్స్ అధినేత పత్తికొండ కుమారస్వామి దర్శకుడు భానుశంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'సరదాగా అమ్మాయితో'. నిర్మాత మాట్లాడుతూ- . భాను శంకర్ తయారుచేసిన సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇదొక యూత్ ఎంటర్‌టైనర్. రవిశర్మ సంగీతం హైలైట్' అని తెలిపారు.

ఈ చిత్ర కథకి 'సరదాగా అమ్మాయితో' అనే టైటిల్‌ సరిగ్గా సరిపోతుంది. దర్శకుడు భానుశంకర్‌ తయారుచేసిన సబ్జెక్ట్‌ యువతనే కాక, ఫ్యామిలీ ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుందని వరుణ్ సందేశ్ తెలిపారు.

సుమన్, అలీ, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ముమైత్‌ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, స్క్రీన్‌ప్లే: సురేంద్ర కృష్ణ, నిర్మాతలు: పత్తికొండ అర్పిత్, పత్తికొండ కిషోర్, పత్తికొండ కిరణ్, దర్శకత్వం: భానుశంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X