For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR30: ఎన్టీఆర్ - కొరటాల సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కథతో పాటు హీరో పాత్ర వివరాలు లీక్

  |

  కొంత కాలంగా వరుస పెట్టి హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలో నటించిన అతడు.. దీని తర్వాత పలు ప్రాజెక్టులను కూడా ప్రకటించాడు.

  అందులో బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసే సినిమా ఒకటి. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు హీరో క్యారెక్టర్, స్టోరీ లైన్ బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  RRR మూవీ పూర్తి చేసిన ఎన్టీఆర్

  RRR మూవీ పూర్తి చేసిన ఎన్టీఆర్

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి రూపొందించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో నటించాడు. ఇందులో రామ్ చరణ్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందించారు.

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  30వ సినిమాకు డైరెక్టర్ మారాడు

  30వ సినిమాకు డైరెక్టర్ మారాడు

  RRR షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండానే తన తదుపరి ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  తారక్ - కొరటాల మూవీ డీటేల్స్

  తారక్ - కొరటాల మూవీ డీటేల్స్

  ‘జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడట. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  అప్పుడే అనుకుంటే ఆలస్యంగా

  అప్పుడే అనుకుంటే ఆలస్యంగా

  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని గురించి ఎన్నో రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఫలానా రోజు ప్రారంభం అవుతుందని అంటూ వస్తున్నారు. కానీ, కోవిడ్ మహమ్మారితో పాటు పలు కారణాల వల్ల ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.

   డేట్ ఫిక్స్ చేసుకున్న యూనిట్

  డేట్ ఫిక్స్ చేసుకున్న యూనిట్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 7వ తేదీన జరగబోతున్నాయట. హైదరాబాద్‌లో దీన్ని అంగరంగ వైభవంగా చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి బడా గెస్టులు కూడా వస్తున్నారని అంటున్నారు.

  హాట్ వీడియోతో షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో ఆమెను ఇలా చూశారంటే తట్టుకోలేరు!

  ఎన్టీఆర్ సినిమా స్టోరీ లైన్ రివీల్

  ఎన్టీఆర్ సినిమా స్టోరీ లైన్ రివీల్

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా చాలా పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇది ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందట. ఒక స్టూడెంట్ లీడర్ ఫారెస్ట్ మాఫియాను ఎలా మార్చాడన్నదే ఈ మూవీ స్టోరీ లైన్ అని సమాచారం. ఇందులో తారక్ రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నాడని టాక్.

  Recommended Video

  Jr NTR As Peddi | Exciting Updates On NTR 31 | Filmibeat Telugu
  సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్

  సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్

  సూపర్ హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు పెట్టబోయే టైటిల్ గురించి కూడా ఇప్పటి వరకూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘రుద్ర' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అన్ని భాషల్లోనూ ఇదే పేరు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని నిర్మాణ సంస్థ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించిందని తెలిసింది.

  English summary
  Tollywood Star Hero Jr NTR will do a film Under Koratala Shiva Direction. Now Rudhra Title Fix for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X