కాంతార బ్యూటీ ప్రైవేట్ ఫోటో లీక్.. అతనితో అలా !
కన్నడ బ్యూటీ భామ, కాంతార హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 'సప్త సాగరాలు దాటి' మూవీతో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్న రుక్మిణి, ఆ తర్వాత 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతను ఆకట్టుకున్నది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా మారింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పర్సనల్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ సంగతేంటీ ? ఆ సంగతేంటీ?
అయితే కెరీర్ పరంగా మంచి దూకుడు మీద ఉన్న సమయంలోనే రుక్మిణి వసంత్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సిద్ధాంత్‌తో ప్రేమలో ఉందంటూ నెట్టింట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధాంత్ ఒక ఫోటోగ్రాఫర్ (కొన్ని కథనాల్లో నటుడిగా కూడా పేర్కొంటున్నారు) కాగా, ఇద్దరూ కలిసి ఉన్న పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల ఆధారంగా రుక్మిణి కమిటెడ్ అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు.

అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అన్నది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. ముఖ్యంగా వైరల్ అవుతున్న ఫోటో 2023లో రుక్మిణి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పాత ఫోటో అని తెలుస్తోంది. అందులో ఉన్న వ్యక్తి ఆమె ప్రియుడు కాదు, తన స్నేహితుడు సిద్ధాంత్ నాగ్ అని సమాచారం. అప్పట్లో ఇద్దరూ నటన రంగంలో ప్రయత్నాలు చేస్తూ సన్నిహితంగా ఉండేవారని, కానీ రుక్మిణికి వరుస అవకాశాలు రావడంతో ఆమె కెరీర్ పూర్తిగా బిజీ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి అనధికారిక వార్తలు రావడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు అవి నిజమవుతాయి, మరికొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి. రుక్మిణి విషయంలో కూడా ఇప్పటివరకు ఆమె గానీ, సిద్ధాంత్ గానీ ఈ డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. దీంతో ఈ రూమర్లు నిజమా? కాదా? అన్నది అభిమానుల్లో ఇంకా సందేహంగానే ఉంది.
ఇదిలా ఉంటే.. రుక్మిణీ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, రుక్మిణి కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. 'కాంతార' విజయంతో ఈ అమ్మడు రేంజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ లో లీడ్ రోల్ నటిస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon)లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలు రుక్మిణి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారినప్పటికీ, వాటిపై ఎలాంటి స్పష్టత లేదు. అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











