కన్నడ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్.. ఆమెను చూస్తే సర్‌ప్రైజ్ అవడం ఖాయం
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టినా.. తనదైన శైలి చిత్రాలతో ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ దేవరకొండ సరైన సక్సెస్‌లను సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు.
చాలా కాలంగా విజయాన్ని అందుకోలేక సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం అతడు ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఇలా ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసే సినిమా షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వరకూ పార్ట్ కంప్లీట్ అయింది.

గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తుండగానే విజయ్ దేవరకొండ తన మరో ప్రాజెక్టును కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు. దీన్ని 'రాజా వారు రాణి గారు' సినిమా ఫేం రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్లు ముందే తెలిపారు.
విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా కలయికలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ఈ మూవీ షూట్‌కు చాలా సమయం ఉండడంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టారు. ఇలా తాజాగా హీరోయిన్ న్యూస్ లీకైంది.

విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా రూపొందించే ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ పిల్ల రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుందని టాక్ వచ్చింది. కానీ, ఆమెను కాదని రుక్మిణిని తీసుకుంటున్నారని సమాచారం. ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ ఈ హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అలా ఆమె అందాన్ని చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందులో నటించే నటీనటులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే రివీల్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











