For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య కీలక నిర్ణయం: ఇకపై అలా చేయకూడదని డిసైడ్.. బాధ్యతలను అప్పగించేశాడు.!

  By Manoj
  |

  నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు నటసింహా బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక, 1990 దశకంలోనైతే బాలయ్యకు గోల్డెన్ పిరియడ్ నడిచింది. ఆ పది సంవత్సరాల్లో ఆయన స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. దీంతో బాలకృష్ణకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన పేరుపై రిజిస్టర్ అయి ఉన్న అభిమాన సంఘాలు మరో హీరోకు లేవనే చెప్పాలి. అలాంటి బాలయ్య.. ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే..

   అది కూడా పట్టాలెక్కించేశాడు

  అది కూడా పట్టాలెక్కించేశాడు

  ‘రూలర్' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్‌ల తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే ఈ కాంబోలో హ్యాట్రిక్ నమోదైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి.

  అప్పటి నుంచి షురూ చేస్తున్నారు

  అప్పటి నుంచి షురూ చేస్తున్నారు

  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించిన ‘రూలర్' ప్రేక్షకుల ముందుకు వచ్చేయడంతో బాలయ్య.. బోయపాటి శ్రీను సినిమాపై దృష్టి సారించారు. ఇటీవల బోయపాటి చెప్పినట్లుగా ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ను జనవరి నుంచి ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ డేట్ కూడా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. జనవరి మూడు నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ అవుతుందట.

  టాక్ ఒకలా.. పరిస్థితి మరోలా

  టాక్ ఒకలా.. పరిస్థితి మరోలా

  బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘రూలర్'. కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సీ కల్యాణ్ నిర్మించాడు. ఈ సినిమా గత వారం విడుదలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి టాక్‌ను సంపాదించుకున్నప్పటికీ.. కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా పరిస్థితి దారుణంగా తయారయింది.

  బాలయ్య కీలక నిర్ణయం

  బాలయ్య కీలక నిర్ణయం

  ఎంతో కష్టపడి వర్కౌట్లు చేసి నటించిన ‘రూలర్' అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులను రిపీట్ చేయకూడదని ఆయన డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న బోయపాటి సినిమా నుంచి సరికొత్తగా వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

  ఇకపై అలా చేయకూడదని డిసైడ్

  ఇకపై అలా చేయకూడదని డిసైడ్

  రూలర్ మూవీని మూడు నెలల్లోనే ముగించామని సంతోష పడ్డ చిత్ర యూనిట్‌కు భంగపాటు తప్పలేదు. కంటెంట్ మంచిగానే ఉన్నప్పటికీ సినిమాపై క్రేజ్‌ను తీసుకు రాలేకపోయారు. దీంతో సినిమాను త్వరగా పూర్తి చేయడం కాదు.. దానికి అనుగుణంగా హైప్ క్రియేట్ చేయగలగాలని బాలకృష్ణ యోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

  ఆయనకు బాధ్యతలు అప్పగించేశాడు

  ఆయనకు బాధ్యతలు అప్పగించేశాడు

  బోయపాటితో చేయబోయే సినిమా విషయంలో బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇందులో భాగంగానే సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేయాలని డైరెక్టర్ బోయపాటికి చెప్పారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగానే నటీనటుల ఎంపిక ఉండాలని కూడా ఆదేశించాడట. దీంతో ఆ విధంగా మాస్ డైరెక్టర్ పావులు కదుపుతున్నాడని టాక్.

  English summary
  Director Boyapati Srinu will be directing Nandamuri Balakrishna in his next movie. There are more expectations from the fans on the combination of Boyapati Srinu and Balakrishna because of previous hit movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X