ఎమ్.ఎస్.రాజు 'రమ్' చిత్రం ఆ హాలీవుడ్ కాపీనా?
ఇక తాజాగా ఎమ్.ఎస్ రాజు తన 'రమ్' చిత్రం షూటింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ మస్కట్ లో చేసారని వినికిడి. విజయన్ స్టంట్ మాస్టర్ తమ చేత అదిరిపోయే క్రేజీ స్టంట్స్ చేయించారని,నీళ్లలో,మంటల్లో, గాలిలో ఈ ఫైట్స్ తీసారని నిఖిషా పటేల్ చెప్పటం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈచిత్రంలో రంభగా త్రిష మెయిన్ రోల్ చేస్తుండగా.....ఇతర హీరోయిన్లు పూర్ణ, అర్చన సైడ్ క్యారెక్టర్స్ ఊర్వశి, మేనక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కారు రేస్ సన్నివేశంలో రిస్క్ తీసుకుని ఫైట్ చేసిందట త్రిష.
దర్శక నిర్మాతలు డూపుతో చిత్రీకరిద్దామన్నా వద్దని వారించి మరీ ఈ త్రిష రిస్కీ ఫైట్ కోసం సాహసం చేసిందట. ఈ విషయం గురించి త్రిష తెలుపుతూ ఇలాంటి సాహసోపేత సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు హీరోలు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అర్థం అవుతుందన్నారు.


Click it and Unblock the Notifications












