'గబ్బర్ సింగ్'..'కెవ్వు కేక'పాట ప్రభాస్ దా?

By Srikanya

గబ్బర్ సింగ్ చిత్రంలో దేవి శ్రీ స్వరపరిచిన సూపర్ హిట్ సాంగ్ 'కెవ్వు కేక'. ఐటమ్ సాంగ్ కోసం చేసిన ఈ పాటపై గత రెండు రోజులుగా ఓ చిత్రమైన టాపిక్ నడుస్తోంది. నిజమో...ఉత్తదో తెలియదు కానీ..ఈ పాట ..ప్రభాస్ తాజా చిత్రం రెబెల్ కోసం తమన్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ రెండు ట్యూన్స్ సిమిలర్ గా ఉండటంతో ఇఫ్పుడు బ్యాంకాక్ లో ప్రభాస్ తో చిత్రీకరించాల్సిన ఈ పాట షూటింగ్ కాన్సిల్ చేసారని చెప్తున్నారు. ఆ పాటని తమన్నా, ప్రభాస్ లపై చిత్రీకరించాల్సింది. ఈ పాటను తీస్తే గబ్బర్ సింగ్ పాటను కాపీ చేసినట్లు ఉంటుందని ఆపేసినట్లు తెలుస్తోంది. ఇక ఇది విన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు.

అయితే కొందరు ఈ రెండు పాటలకూ ఒకే మూలముండవచ్చునని, అందుకే సిమిలారిటీ వచ్చి ఉంటుందని వాదిస్తున్నారు. పాటలో మిగతా లిరిక్స్ సంభంధం లేకపోయినా కెవ్వు కేక అనే వరకూ మాత్రం ఒకేటనని చెప్పుకుంటున్నారు. తమన్ చాలా పాటలు ఎత్తిపోతలు పధకాలే కాబట్టి ఇదీ ఎక్కడనుంచో తీసుకునే ఉండి ఉండవచ్చునని,అయితే దేవి గారే అదే తీసుకోవటంతో సమస్య వచ్చి ఉంటుందని అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి లారెన్స్,ప్రభాస్ చాలా డిజప్పాయింట్ అయ్యారని,తమ పాటే ముందు వచ్చి ఉంటే ఇంతకన్నా పెద్ద హిట్ అయ్యేదని చెప్తున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే తమన్ ఈ చిత్రం నుంచి బయిటకు వచ్చారని,లారెన్స్ తానే ఈ చిత్రానికి సంగీతం అందుస్తున్నాడని ఆ మద్యన వార్తలు కూడా వచ్చాయి.

ఇక గబ్బర్ సింగ్ ఆడియో విషయానికి వస్తే ..ఇప్పటికే ఈ ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాటలు సీడిలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మొన్న ఆదివారం జరిగిన ఆడియో పంక్షన్ లో ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ పవన్ ఈ చిత్రంలో పాడటం,కోట శ్రీనివాసరావు పాడటం వంటివి జరిగాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఓ అభిమానిలా ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ కి నచ్చేలా తీర్చిదిద్దానని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. అందరూ చాలా కాలం తర్వాత పవన్ కి వస్తున్న మెగా హిట్ గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు.


ప్రభాస్ రెబెల్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు మొదలయ్యి చాలా కాలం అయింది . ఇప్పటికీ ఈ సినిమా ఓ కొలిక్కి రాలేదు. అనుకున్న బడ్జెట్ ని ఈ చిత్రం ఎప్పుడో దాటేసిందని వార్తలు వచ్చాయి. ఎవరన్నా టేకోవర్ చేసుకుంటారని ఆ మధ్యన ఎదురుచూసినట్లుకూడా వినపడింది. అయితే ఇప్పుడు నిర్మాతలే ఈ చిత్రాన్నీ పూర్తి చేసి త్వరగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. పూర్తైన మేరకు ఈ చిత్రం మంచి అవుట్ పుట్ వచ్చింది తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X