twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీదేశీ మోడల్‌తో పవన్ కళ్యాణ్ సహజీవనం?

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తన సహచర నటి రేణు దేశాయ్ తో సహజీవనం చేసి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తాపీగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పెళ్లి తంతు అనేది పవన్ కు ఇష్టం ఉండదని, ఆ మధ్య ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో పాల్గొన్న పవన్ రాజకీయంగా వచ్చిన విమర్శల నేపథ్యంలో హడావుడిగా పెళ్లి చేసుకున్నారనే వాదన కూడా ఉంది.

    చాలా కాలంపాటు సజావుగానే సాగిన వీరి కాపురం...ప్రస్తుతం కళ తప్పిందని, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నాయనే గాసిప్స్ కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా వపన్ మరొక విదేశీ మోడల్ తో సహజీవనం మొదలు పెట్టాడనే పుకార్లు కూడా వినిపస్తున్నాయి. ఈ కారణంగానే రేణు తన పుట్టింటికి వెళ్లిందనే వార్తలు కూడా లేక పోలేదు.

    మరి ఈవార్తల్లో నిజం ఎంతో తెలియదు గానీ...పవన్ దంపతులు రంగంలోకి దిగి ఈ వార్తలను ఖండించడం చేస్తేగానీ అభిమానుల్లో ఉన్న అయోమయం తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గబ్బర్ సింగ్, పంజా షూటింగులతో బిజీగా గడుపుతున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ షూటింగ్ నిమిత్తం తమిళనాడులోని పోల్లాచ్చి ప్రయాణానికి సిద్దం అవుతోంది.

    English summary
    A new rumor about Pawan Kalyan has been floating around few gossip websites that he is living in with a foreign model.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X