రామ్ చరణ్ కొత్త చిత్రంపై రూమర్

By Srikanya

రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆకుల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఓ రూమర్ లాంటి గాలి వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రయాణం చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్యారక్టైరేజేషన్.. చిరంజీవి గత చిత్రాలైన దొంగ మొగుడు, రౌడీ అల్లుడు నుంచి ప్రేరణ పొంది చేసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలోనూ రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అంతేగాక ఓ పాత్ర క్లాస్ గానూ, మరో పాత్ర మాస్ లుక్ తోనూ ఉంటుందని, పూర్తి స్ధాయి కామిడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారని చెప్పుకుంటున్నారు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని, రామ్ చరణ్ కెరీర్‌ లో మరో బిగ్గెస్ట్ హిట్‌ గా నిలవనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనుందని టెక్నీషియన్స్ అందర్నీ త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలియచేసారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డిస్కషన్స్, కధ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని ఈ చిత్రాన్ని కుటుంబ నేపద్యంలో సాగే యాక్షన్ సినిమాగా చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో అత్త పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పాత్రలో ఓ ప్రముఖ నటిని నటింప చేసే ప్రయత్నాలు జరిగుతున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2012లో ప్రారంభంలో సెట్స్ ఫై కి వెళ్ళనుందని సమాచారం. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X