ప్రభాస్ పెళ్లి వార్త హాట్ టాపిక్... అమెరికా బిజినెస్‌మెన్ కూతురుతో?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరూ ముందుగా చెప్పే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించిన చర్చ సాగుతూనే ఉంది. అయితే అది కేవలం ప్రచారానికే పరిమితం అయిందే తప్ప... కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ సారి మాత్రం ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. ఈ బాహుబలి స్టార్ ఓ ఇంటివాడు కావడం ఖాయం అంటున్నారు. అయితే ఈ విషయంలో అఫీషియల్ సమాచారం అయితే లేదు.

అమెరికాకు చెందిన బిజినెస్‌మెన్ కుమార్తెతో?
అమెరికాకు చెందిన ఒక బిజినెస్‌మన్ కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అమ్మాయి పేరు, ఇతర వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

గతంలో ప్రభాస్ పెళ్లి విషయంలో రకరకాల రూమర్స్
ఇంతకు ముందు కూడా ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరిగింది. తన కోస్టార్ అనుష్క శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇద్దరు స్టార్స్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని స్పష్టం చేశారు.

40కి చేరువలో ప్రభాస్
ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఇంతలా ఆందోళన చెందడానికి కారణం ప్రభాస్ వయసే. యంగ్ రెబల్ స్టార్ 40కి దగ్గరవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. 40 లోపే తమ అభిమాన హీరో పెళ్లి జరిగిపోవాలని వారు ఆశ పడుతున్నారు. మరి వారి కోరిక ఈ సంవత్సరమైనా తీరుతుందా? ఈ సారైనా ఆయన పెళ్లి వార్తలు నిజం అవుతాయా? అనేది వేచి చూడాల్సిందే.

ప్రభాస్ సాహో
ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజీత్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.


Click it and Unblock the Notifications











