పుకార్లు షికార్లు...బిత్తిరి సత్తి స్పందించాల్సిన అవసరం ఉంది!

బిత్తిరిసత్తి మీద సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. బుల్లితెరకు సత్తి గుడ్ బై చెప్పబోతున్నట్లు ఆ వార్తల సారాంశం.

By Bojja Kumar

Recommended Video

Bithiri Sathi say Good Bye to Small Screen తీన్మార్ వార్తలకు బిత్తిరి సత్తి గుడ్ బై

బిత్తిరి సత్తి.... తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. వి6 ఛానల్ లో 'తీన్మార్ వార్తలు' అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి.... డిఫరెంట్ గెటప్, యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో బిత్తిరి సత్తిని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే.

సత్తి గురించి షాకింగ్ న్యూస్

సత్తి గురించి షాకింగ్ న్యూస్

తాజాగా బిత్తిరి సత్తి గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సత్తి తీన్మార్ వార్తలకు గుడ్ బై చెప్పనున్నాడని, బుల్లితెరను వదిలేసి సినిమా రంగంలోనే సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.

బిజీ బిజీ

బిజీ బిజీ

తీన్మార్ వార్తల ద్వారా పాపులర్ అయిన సత్తికి సినిమా ఆఫర్లు బాగా వస్తున్నాయని, దీంతో రెండింటికి సమయం కేటాయించడం భారంగా మారుతోందని... అందుకే పేరు, డబ్బు రెండు ఎక్కువగా వచ్చే సినిమా రంగాన్నే తన కెరీర్ గా ఎంచుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.

అసలు ఇది నిజమేనా? సోషల్ మీడియాలో వైరల్

అసలు ఇది నిజమేనా? సోషల్ మీడియాలో వైరల్

బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలకు గుడ్ బై చెబుతున్నాడనేది ఇప్పటి వరకు కేవలం ఓ పుకారుగా మాత్రమే ఉంది. ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. అయితే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై బిత్తిరి సత్తి సోషల్ మీడియా ద్వారా ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రయత్నాలు చేస్తున్నాడట

ప్రయత్నాలు చేస్తున్నాడట

పక్కా ప్లానింగుతో తన కెరీర్ ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న బిత్తిరి సత్తి.... ఇపుడు సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమా అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను కూడా నియమించుకున్నట్లు సమాచారం.

ఎవరీ బిత్తిరి సత్తి?

ఎవరీ బిత్తిరి సత్తి?

బుల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి. రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.

మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు

మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు

స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నించిన రవి మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. మొదటి అవకాశం జీ తెలుగు ఛానల్ లో కామెడీ క్లబ్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ షో సక్సెస్ కావడంతో అతనికి వి6 తీన్మార్ లో అవకాశం వచ్చింది.

అతని జీవితాన్ని మార్చేసింది

అతని జీవితాన్ని మార్చేసింది

వి6 చానల్ కార్యక్రమం ‘తీన్మార్' చేవేళ్ల రవి జీవితాన్నే మార్చేసింది. బిత్తిరి సత్తిగా అతని కొత్త అవతారం, డిఫరెంట్ యాటిట్యూడ్ అతన్ని పెద్ద సెలబ్రిటీని చేసింది. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పల్లె ప్రాంతాల నుండి, పట్టణాల వరకు బిత్తిరి సత్తి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షోలో అవకాశం కోసం మొదటి నెల తన టాలెంట్ నిరూపించుకోవడానికి జీతం లేకుండానే పని చేశాడట సత్తి. అతని పనితీరు నచ్చడంతో మరుసటి నెల నుండి రూ. 30 వేల జీతం ఫిక్స్ చేసారట ఛానల్ యాజమాన్యం.

ఇపుడు లక్షపైనే

ఇపుడు లక్షపైనే

తీన్మార్ షో బాగా పాపులర్ కావడం, ఈ షో కారణంగా టీవీ ఛానల్ రేటింగ్ కూడా భారీగా పెరగడంతో బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. ఇపుడు అతడు నెలకు రూ. లక్ష ముప్పైవేల నుండి లక్షా యాభై వేలు తీసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X