అఖిల్ అన్నిట్లో వేళ్ళు పెడుతున్నాడట: విక్రమ్ కుమార్‌ని చికాకు పెడుతున్నాడా??
Recommended Video

మొదటి సినిమా సమయం లోనే అఖిల్ అవసరమైన దానికంటే ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాడనే టాక్ వచ్చింది. మొదటిసినిమాకే వీవీ వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ని పెట్టుకొని కూడా ప్రతీదానిలో వేలుపెట్టి చికాకు పెట్టాడనే టాక్ బాగానే బయటకి వచ్చింది. అసలు మొదట్లోనే ఆ కథ వద్దు అని చాలామందే సలహాలిచ్చినా, అదే కథ చేస్తానని పట్టుబట్టి మరీ చేసాడు. అదీ దర్శకున్ని బాగానే చికాకుపెట్టాడని, చాలావరకూ నిర్ణయాలు తానే తీసుకున్నాదనీ చెప్పుకున్నారు...

నాగార్జునకి చాలా సమయం పట్టింది
అంతా చేస్తే ఆ సినిమా కాస్త దారుణమైన ఫ్లాప్ ఇచ్చి అఖిల్ కి బోణీ సినిమానే డిజాస్టర్ అయిపోయింది. ఆ దెబ్బకి రెండో సినిమా సెట్ చేయటానికి నాగార్జునకి చాలా సమయం పట్టింది. అటూ ఇటూ పడి ఇద్దరుముగ్గురు పేర్లు మారిపోయాక "మనం" తీసిన విక్రమ్ కుమార్‌తో హలో చిత్రాన్ని పట్టాలెక్కిస్తే ఇందులో కూడా అఖిల్ జోక్యం ఎక్కువగా వుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

అన్నిట్లో అఖిల్ సలహాలు ఇస్తున్నాడట
పాటలు ఓకే చేయడం దగ్గర్నుంచి ఫైట్లు ఎలా వుండాలనే దాని వరకు అన్నిట్లో అఖిల్ సలహాలు ఇస్తున్నాడట. ఒక విజన్‌తో పని చేసే విక్రమ్ కుమార్‌కి ఇది నచ్చడం లేదని, ఇప్పటికే నాగార్జునకి కంప్లయింట్ కూడా చేసాడని పుకార్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 22న విడుదల చేయడానికి నాగార్జున ఫిక్స్ చేయడంతో హలో పనులు వేగంగా జరుగుతున్నాయి.

అవుట్‌పుట్‌పై ప్రభావం
అయితే అఖిల్ తన పని తాను చేయకుండా మిగతా వాటిలో వేళ్లు పెట్టడం వల్ల జాప్యం జరుగుతోందని, దీని వల్ల ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై ప్రభావం పడవచ్చునని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇది నిజమే అయితే కనుక ఇకపై అఖిల్‌తో పని చేయడానికి పెద్ద దర్శకులు జంకుతారేమో కదూ.

స్పీడ్ ఉంటుంది కదా మరీ
ఈ విషయం లో అఖిల్ కంటే నాగార్జునే కాస్త ఆలోచిస్తే బావుంటుందేమో అన్నది చాలామంది అభిప్రాయం. ఇంకా కుర్రవాడే కావటం వల్ల కాస్త స్పీడ్ ఉంటుంది కదా మరీ. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మంచి హిట్ ని ఇచ్చిన విక్రమ్ కుమార్ హలో సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

చివరి షెడ్యూల్ తో
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ తో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. మిగతా బిజీల్లో ఉండికూడా చాలా వరకు నాగార్జునే చూసుకుంటున్నాడట . సినిమాను కూడా ఆయనే రిచ్ గా నిర్మిస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించనున్నాడట.


Click it and Unblock the Notifications











