KGF దర్శకుడికి కాస్త గ్యాప్ ఇవ్వండయ్యా బాబు.. ఒకేసారి ముగ్గురు హీరోలంటే ఎలా?

తెలుగు సినిమా మార్కెట్ ని నేషనల్ వైడ్ గా విస్తరింపజేసిన రాజమౌళి తరహలోనే కన్నడ సినిమా స్థాయిని కూడా ప్రశాంత్ నీల్ గట్టిగానే నిలబెట్టడాని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా KGF సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. ఇంకాస్త ప్రమోషన్ డోస్ పెంచి ఫస్ట్ పార్ట్ లో బాలీవుడ్ స్టార్స్ ని కూడా సెట్ చేసి ఉంటే సినిమా మరింత విజయం సాదించెదని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ KGF 2తో రానున్న ఆ దర్శకుడి భవిష్యత్తు ప్రాజెక్టులపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

KGF కంటే ముందు ఆ సినిమాతో..

KGF కంటే ముందు ఆ సినిమాతో..

ప్రశాంత్ నీల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో KGF కంటే ముందు వరకు పెద్దగా క్రేజ్ అందుకుంది లేదు. ఆ సినిమకంటే ముందు అతను ఒకే ఒక్క సినిమా తీశాడు. తన దగ్గరి బంధువైన శ్రీ మురళితో ఉగ్రమ్ అనే సినిమాను కేవలం 4కోట్ల రూపాయలతో తెరకెక్కించాడు. ఇక ఆ సినిమా 30కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడంతో యష్ KGFకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తెలుగు హీరోలపై స్పెషల్ ఫోకస్

తెలుగు హీరోలపై స్పెషల్ ఫోకస్

KGF సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నుంచి ప్రశాంత్ మినిమామ్ పాన్ ఇండియా సినిమా అనే విధంగా కథలను రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు హీరోలపై కూడా ఈ హీరో ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ అని భారీ స్థాయిలో ప్రచారం కొనసాగిన విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్ తో సెట్టయినట్లే..

ఎన్టీఆర్ తో సెట్టయినట్లే..

మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోనే ఎన్టీఆర్ తో వర్క్ చేయనున్నట్లు ఆ మధ్య ఒక పోస్టర్ ద్వారా తెలిసిపోయింది. త్వరలోనే కలవబోతున్నట్లు దర్శకుడు కూడా చెప్పడంతో కాంబినేషన్ సెట్టయ్యే ఛాన్స్ ఉందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నెక్స్ట్ ప్రభాస్, రామ్ చరణ్ అని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

KGF Chapter 2 Satellite Rights Sold for Record Price 120Cr
 ఒకేసారి ముగ్గురంటే..

ఒకేసారి ముగ్గురంటే..


అయితే ఒకేసారి ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తుండడంతో రూమర్స్ కి కాస్త గ్యాప్ ఇవ్వండి అంటూ నెటీజన్స్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ప్రభాస్ అయితే ప్రస్తుతం దొరికే అవకాశం లేదు కాబట్టి ప్రశాంత్ మెగా పవర్ స్టార్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే RRR తరువాత తారక్ త్రివిక్రమ్ తో కలవనున్నాడు. కానీ రామ్ చరణ్ ఇంకా తన తరువాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కథ నచ్చితే వర్క్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X