కీరవాణి ఆఖరి సినిమా అదే అయితే.. రాజమౌళి పరిస్థితేంటి?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక సెంటిమెంట్ బలంగా ఉంటుంది. అదే కాంబినేషన్. కాంబినేషన్ సెట్టయితే సినిమా సగం హిట్టయినట్లే అనే నమ్మకాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా డైరెక్టర్ - హీరో కాంబినేషన్ ఒకటైతే.. మ్యూజిక్ డైరెక్టర్ - డైరెక్టర్ కాంబో మరొకటి. అందులో కీరవాణి - రాజమౌళి కాంబినేషన్ ఎక్కువగా హిట్టయ్యింది. ఇంతవరకు జక్కన్న తన సినిమాలకు తన అన్నయ్య కీరవాణినే ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కీరవాణి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

 హిట్ కాంబో..

హిట్ కాంబో..

ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలు చేశాడు. మరో సినిమా సెట్స్ పై ఉంది. అపజయం లేని దర్శకుడిగా రాజమౌళి టాలీవుడ్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా మన సినిమాలు కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోగలవని నీరూపించాడు. అయితే ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాజమౌళి సినిమాలకు సంగీతం అందించేది కీరవాణి మాత్రమే. హిట్ కాంబినేషన్ గా వీరికి మంచి గుర్తింపు దక్కింది.

కీరవాణి మాత్రమే..

కీరవాణి మాత్రమే..

రాజమౌళి ఎలాంటి జానర్స్ టచ్ చేసినా కూడా ట్యూన్స్ కట్టాల్సింది కీరవాణి గారే. రాజమౌళి వల్ల కీరవాణి తన సంగీతం విషయంలో కూడా చాలా మార్పులు చేశారు. హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విదంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించడం స్టార్ట్ చేశారు. అలాగే తన మెలోడీ సంగీతాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ట్తనకు నచ్చినట్లుగా కీరవాణి మాత్రమే వర్క్ చేయగలరని జక్కన్న మనసులో బలమైన ముద్ర పడింది.

ఆయన రిటైర్మెంట్ ఇస్తే..?

ఆయన రిటైర్మెంట్ ఇస్తే..?

అసలైతే బాహుబలి అనంతరం తన రిటైర్మెంట్ ఉంటుందని కీరవాణి అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జక్కన్న మాత్రం ఆయనను వదల్లేదు. RRR కోసం మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఇక మరోసారి కీరవాణి రిటైర్మెంట్ గురించి రూమర్స్ వస్తున్నాయి. బయట నుంచి ఎన్ని ఆఫర్స్ వస్తున్నా కూడా కీరవాణి ఒప్పుకోవడం లేదు. కేవలం పవన్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజమౌళితో RRR సినిమానే ఆఖరిది అనే టాక్ వైరల్ గా మారుతోంది.

Recommended Video

RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster
రాజమౌళి ఏం చేస్తాడో..

రాజమౌళి ఏం చేస్తాడో..

కీరవాణి వయసు 60లోకి వచ్చేస్తోంది. అయితే ఆయన కొన్ని సంవత్సరాల తరువాత సినిమాలకు దూరంగా ఉండి కాస్త రెస్ట్ తీసుకోవాలని ఆశిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఒకవేళ కీరవాణి ఎండ్ కార్డ్ పెడితే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్టులకు ఎవరు వర్క్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య కీరవాణి తనయుడు కాల భైరవ రాజమౌళి కోసం సిద్దమవుతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే అతను మాత్రం ఇంకా కీరవాణి స్థాయిలో సిద్ధం కాలేడు. దీంతో రాజమౌళితో భవిష్యత్తులో వేరే సంగీత దర్శకులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X