ఎన్టీఆర్...వినాయక్ సినిమా ఉండదా?

అయితే వారు మాత్రం మొదటినుంచి వినాయక్ ...చిరంజీవి కి ఫేవర్ గా ఉండటం,ఇంకా కొన్ని కాస్ట్ పరమైన కారణాలు చెప్తుకొస్తున్నారు. అలాగే ఎక్కడా వి.వి.వినాయక్ తాను రాజకీయాల్లోకి వస్తానని నామమాత్రంగా కూడా బయికపడకపోవటం ఇక్కడ గుర్తుంచుకోతగ్గ మరో విషయం. అయితే కొందరు మాత్రం వినాయక్ ఫామ్ లో ఉన్న స్ధితిలో కెరీర్ ని వదులుకుని టిక్కెట్ ఇస్తే మటుకు పొలిటిక్స్ లోకి ఎందుకొస్తాడని లాజిక్ లాగుతున్నారు. అయినా ఎన్టీఆర్ తో సినిమా బాగా లేటవటం ఈ పుకార్లు కు ఆధారమవుతోందనేది నిజం.
అందులోనూ ఆది చిత్రంతో తనకు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చిన ఎన్టీ ఆర్,కొడాలి నాని సినిమా చెయ్యననటం అనేది నమ్మలేని వార్తే అవుతుంది. ఇక విశ్వసనీయంగా తెలుస్తున్న దాని ప్రకారం ఈ సినిమా ఈ నెలాఖరున ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే కృష్ణ సినిమాలా పూర్తి స్ధాయి ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసిన ఏక్షన్ ధ్రిల్లర్ అని తెలుస్తోంది. ప్రస్తుంతం స్కిప్టు కి మరింత మెరుగులు దిద్దే పనిలో వినాయక్ బయిటకు కూడా రాకుండా లీనమయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











