ఎన్టీఆర్ సినిమా ఆగటానికి కారణాలు?

తర్వాత తాజాగా నిర్మాణమవుతున్న రామ్ -బి గోపాల్ ల మస్కా చిత్రానికి కథ అందించిన సూర్య అనే రచయిత ఎన్టీఆర్ చిత్రానికి కథ చెప్పాడుట. బాగా ఇంప్రెస్ అయిన వినాయిక్,ఎన్టీఆర్ ...నిర్మాతతో పాతిక లక్షలకు అతనికి ఇప్పించటానికి కమిట్ అయ్యారు. అలాగే కొన్ని నెలలు పాటు వి.వినాయిక్ మిగతా రచయితలతో ఆ కథలో బెటర్మెంట్స్ కోసం సిటింగ్స్ జరిపారు. ఆ తర్వాత ఏం జర్గిందో ఏమో మొదట ఒప్పుకున్న ఎమౌంట్ ఇవ్వలేమని తేల్చేసారుట. దాంతో అలిగిన ఆ రచయిత వేరే పెద్ద ప్రొడ్యూసర్ వద్దకు ఆ కథను తీసుకెళ్ళి అమ్మేసాడుట.
దాంతో డైలమాలో పడ్డ వినాయిక్ వెంటనే కథను ప్రిపేర్ చెయ్యలేకపోవటం, చెప్పిన పాయింట్స్ ఎన్టీఆర్ కి నచ్చకపోవటం జరిగిందిట. అలా ఇప్పటికీ కథ లేదుట. అందులోనూ వినాయిక్ ...చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో తన వారికి కొద్ది మందికి సీట్లు ఇప్పించాలని తిరగటం జరుగుతోందిట. మరో ప్రక్క ఎన్టీఆర్ ...తెలుగుదేశం పార్టీ తరుఫున తన వారికి సీట్లు ఇప్పించాలని పట్టుదలతో ఉన్నారుట. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఉండటమే ఈ ప్రాజెక్టు కి ప్లాబ్లెమ్ గా తయారవుతోందిట.


Click it and Unblock the Notifications











