twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి, రజనీకాంత్‌లపై పుకార్లు..షికార్లు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారీ అంచనాలతో వచ్చిన శంకర్ ‘ఐ' చిత్రం ఓపెనింగ్స్ బాగానే వసూలు చేస్తున్పటికీ సినిమా అంచనాలకు తగిన విధంగా లేదనే టాక్ మాత్రం ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ విమర్శకుల నుండి ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్ వచ్చింది. ఇపుడు అందరి దృష్టి సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందనేదానిపైనే...

    ఆ సంగతి తక్కన పెడితే...‘ఐ' చిత్రం టాక్ నేపథ్యంలో ఆయనతో తర్వాతి సినిమాలు చేయబోయే స్టార్స్ అయోమయంలో పడ్డారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య చిరంజీవి తన 150వ సినిమా శంకర్ తో ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి అయోమయంలో పడ్డారని ఫిల్మ్ నగర్ టాక్.

    అదే సమయంలో ‘లింగా' ప్లాపు కావడంతో ఆలోచనలో పడ్డ రజనీకాంత్ కూడా శంకర్‌తో చేయబోయే ‘రోబో-2' విషయంలోనూ అయోమయంలో ఉన్నారట. ఈ పుకార్లను ఎవరు పుట్టించారో తెలియదు కానీ ఇపుడు ఈ విషయం సినిమా సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Rumors on Rajinikanth and Chiranjeevi?

    చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...
    మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

    తనను కలవాలని ఆశ పడుతున్న బాలు అనే క్యాన్సర్ బాధిత బాలుడిని ఇటీవల హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో కలిసిన చిరంజీవి.....150వ సినిమా ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని, ఇందులో బాలుకు కూడా నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ బాలుడు తన అభిమాన హీరో చిరును కలవడం మాత్రమే కాదు, చిరు 150వ సినిమాలో నటించడం ఆయన అదృష్టం అని అంటున్నారు. బాలుడి కోరిక తిరినందుకు మెగా ఫ్యాన్స్ సంతోషం వయక్తం చేస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నారు.

    English summary
    Film Nagar source said that, Chiranjeevi not interested on Shankar's direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X