హీరో విశాల్ వివాహం ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది?

Recommended Video

Vishal And Anisha Reddy Marriage Has Been Canceled??

తమిళనాడులో సెటిలైన తెలుగు కుటుంబంలో పుట్టిన విశాల్.... కోలీవుడ్లో తనదైన టాలెంటుతో హీరోగా ఎదిగాడు. స్టార్‌గా ఓ వెలుగు వెలగడంతో పాటు నిర్మాతగా రాణించాడు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవులు చేపట్టారు. నడిగర్ సంఘం భవనం నిర్మించే వరకు పెళ్లి చేసుకోను అంటూ శపథం చేసి ఈ యంగ్ హీరో అనుకున్నది సాధించాడు. భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో విశాల్ పెళ్లి ఫిక్స్ అవ్వడం, మార్చి 10న ఎంగేజ్మెంట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.

అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునేలోపే షాకింగ్ రూమర్స్

అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునేలోపే షాకింగ్ రూమర్స్

అక్టోబర్ 9న విశాల్-అనీషా పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు ఆ మధ్య వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇంతలోనే ఊహించని రూమర్స్ తెరపైకి వచ్చాయి. విశాల్-అనిషా పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునేలోపే ఇలాంటి షాకింగ్ న్యూస్ రావడం చర్చనీయాంశం అయింది.

ఈ వార్తలు రావడానికి కారణమేంటి?

ఈ వార్తలు రావడానికి కారణమేంటి?

విశాల్-అనీషా రెడ్డి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి మొదట బయటకు వచ్చింది అనీషా ద్వారానే. ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా 2018లో ఈ మ్యాటర్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత విశాల్ అఫీషియల్‌గా అభిమానులకు వెల్లడించారు. అనీషా రెడ్డి తరచూ తనకు కాబోయే వాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా అనీషా రెడ్డి తన సోషల్ మీడియా పేజీ నుంచి ఆ ఫోటోలన్నీ తొలగించింది. దీంతో ఇద్దరి పెళ్లి రద్దయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయా?

ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయా?

విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయనే అనుమానం వ్యక్తం చేస్తూ పలు మీడియా సంస్థలు వార్తా కథనాలు వెలువరించాయి. రియాల్టీలో పరిస్థితులు కూడా అందుకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఉండటంతో చాలా మంది ఇది నిజమే కావొచ్చు అనే నమ్ముతున్నారు.

విశాల్ లేదా అనీషా స్పందిస్తే తప్ప...

విశాల్ లేదా అనీషా స్పందిస్తే తప్ప...

తమ వివాహం రద్దయినట్లు వస్తున్న వార్తలో నిజం ఎంత? అనే విషయంలో సరైన స్పష్టత లేదు. దీంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. మరి ఈ విషయమై విశాల్ లేదా అనీషా స్పందిస్తే తప్ప దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X