ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన దీపిక పదుకోన్.. సందీప్ చెప్పిన ఆ రెండు పనులు చేయలేకనేనా?

స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం జాతీయ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేకున్నా.. ఈ వివాదంపై పరోక్షంగా కామెంట్స్, నర్మగర్భంగా సోషల్ మీడియా పోస్టులతో ముసుగులో గుద్దులాట జరుగుతున్నది. అటు దీపిక పదుకోన్ పీఆర్ టీమ్ లీకులు.. ఇటు నుంచి సందీప్ రెడ్డి సెన్సేషనల్ ట్వీట్‌తో ఈ వివాదం రోడ్డును పడింది. అయితే సందీప్ రెడ్డి వంగా సోమవారం రాత్రి చేసిన ట్వీట్ తెల్లవారే సరికి మీడియాలో వేడి పుట్టించింది. అయితే ఈ సినిమా నుంచి దీపికను తొలగించడమో లేదా ఆమెనే తప్పుకోవడం వెనుక ఆసక్తికరమైన కథనాలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ వివాదం వెనుక మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వివరాల్లోకి వెళితే..

స్పిరిట్ సినిమాలో దీపిక పదుకోన్ నటిస్తున్నారనే వార్త నుంచి త్రిప్తి డిమ్రీని అధికారికంగా హీరోయిన్ అంటూ ప్రకటించే వరకు మీడియాలో అంతా గందరగోళమే నెలకొన్నది. అయితే 30 కోట్ల రెమ్యునరేషన్, అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అలాగే తన 26 మంది టీమ్‌కు ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించాలి. అలాగే కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తాను. అంతేకాకుండా తెలుగు డైలాగ్స్ నేను నేర్చుకోను అనే కండిషన్లు పెట్టడం వల్లనే టీ సీరీస్ ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే ప్రచారం మీడియాలో జరిగింది.

Rumour behind Deepika Padukone rejection of Spirit

అయితే త్రిప్తి డిమ్రీ స్పిరిట్ సినిమాలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపిక పదుకోన్‌కు సంబంధించి.. మరో వార్త మీడియాలో వైరల్ అయింది. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ లభించడంతో స్పిరిట్ సినిమాకు డేట్స్ కేటాయించలేకపో గొంతెమ్మ కోరికలు కోరింది. అలా ఈ సినిమాను రిజెక్ట్ చేసేందుకు ఆమె రకరకాలుగా ప్లాన్ చేసింది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

కానీ స్పిరిట్ సినిమా నుంచి దీపిక తప్పుకొన్న తర్వాత సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ మరింతగా ఈ వివాదాన్ని హైలెట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ నేరేషన్ ఇవ్వడానికి ముందు అనధికారికంగా ఈ కథను, పాత్ర గురించి ఎవరికి వెల్లడించకూడదనే ఒప్పందం జరిగింది. అయితే దానిని తుంగలో తొక్కుతూ తన పీఆర్ వర్గాల నుంచి ఈ సినిమా కథలోని కీలక అంశాలు, పాత్ర గురించి మీడియాకు లీక్‌లు ఇచ్చింది. ఇది ఆమె నైజం అంటూ పరోక్షంగా దీపిక పదుకోన్‌పై సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, తాజాగా బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. స్పిరిట్ సినిమాలో బోల్డు సీన్లు, అలాగే లిప్ లాక్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సందీప్ రెడ్డి తన సినిమాలో నింపే మసాలా సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకనే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. మితీమీరిన శృంగారం ఉండటం వల్లే దీపిక తప్పుకొన్నదనే విషయం ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం వెనుక దీపిక పీఆర్ టీమ్ ఉందని స్పిరిట్ యూనిట్ అనుమానిస్తున్నది.

అయితే దీపిక పదుకోన్ టీమ్ ప్రచారం చేస్తున్నట్టు భావిస్తున్న విషయాలను ప్రభాస్ అభిమానులు గట్టిగా తిప్పి కొడుతున్నారు. పఠాన్, ఫైటర్ సినిమాల్లో దీపిక హద్దు మీరి శృంగార సన్నివేశాల్లో నటించింది. అప్పట్టో ఆమె చూపించిన భంగిమలపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమాలను రీ సెన్సార్ చేయాలనే డిమాండ్ కూడా చేశారు. అయితే అలాంటి సినిమాల్లో నటించిన తర్వాత స్పిరిట్‌లో నటించడానికి అభ్యంతరం ఎందుకు అని రెబల్ స్టార్ అభిమానులు నిలదీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X