ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్ నిజమేనా? అతడితో సన్నిహితంగా మీడియా కంటికి చిక్కిన సామ్!
సమంత రుత్ ప్రభు వ్యక్తిగత జీవితంపై మీడియాలో రకరకాల వార్తలు రావడం సాధారణంగా మారాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ వార్తలు మరింతగా పెరిగిపోయాయి. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని వస్తున్న రూమర్లు, గాసిప్స్‌పై ఆమె పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఓ సందర్భంలో వారు కోర్టును కూడా ఆశ్రయించారు.
అయితే వాటికి మాత్రం అడ్డుకట్ట మాత్రం వేయలేకపోయారు. తాజాగా సమంత పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్ గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వాటికి బలం చేకూరేలా ఆమె కనిపించడంతో ఆ వాటికి మరింత బలం చేకూరినట్లయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ అని రూమర్ క్రియేట్ అయిన వ్యక్తితో సమంత రావడం అందరి దృష్టిపడింది. ఆ వివరాల్లోకి వెళితే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత ఆ మూవీ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్నారనే వార్త మీడియాలో కొంతకాలంగా వినిపిస్తున్నది. అయితే ఈ వార్తల గురించి ఎవరూ కూడా ఖండించకపోవడం గమనార్హం. అయితే ఇటీవల కాలంలో రాజ్ నిడిమోరుతో ఆమె మరింత క్లోజ్‌గా మూవ్ అవుతున్నారంటూ జాతీయ మీడియాలోను కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే డేటింగ్, అఫైర్ రూమర్ల మధ్య సమంత ముంబైలో డైరెక్టర్ రాజ్‌తో కలిసి కనిపించడంతో ఒక్కసారిగా ఆ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. రాజ్‌తో కలిసి వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్‌కు హాజరవ్వడంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇప్పటి వరకు వారిద్దరూ కలిసి బయట కనిపించకపోగా.. మొదటిసారి ఇద్దరు ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు రావడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

అయితే పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత హుషారుగా కనిపించింది. ఆమె వెనుకాలే రాజ్ నిడిమోరు కూడా రావడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే ఇద్దరిని చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య 3 ఏళ్ల నుంచి అఫైర్ కొనసాగుతున్నది అని ఓ నెటిజన్ వీడియో కింద కామెంట్ చేస్తే.. రూమర్లు నిజమేనా? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఒకవేళ డేటింగ్ విషయం నిజమైతే ఆమెను సంతోషంగా ఉంచాలని కోరుకొంటున్నాను అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతున్నది.
పికిల్ బాల్ అనే క్రీడను ప్రమోట్ చేయడానికి సమంత రుత్ ప్రభు నిర్ణయం తీసుకొన్నారు ఈ మేరకు చెన్నై టీమ్‌ను ఆమె కొనుగోలు చేశారు. ఈ క్రీడకు సంబంధించిన ప్రపంచ పోటీలు ముంబైలో జరుగుతున్నాయి. ఈ వరల్డ్ లీగ్ మ్యాచులకు ఓనర్‌గా ఆమె రావడం, ఆమెతోపాటు రాజ్ నిడిమోరు కనిపించడంతో రూమర్లు వైరల్ అయ్యాయి. పికిల్ బాల్ క్రీడను అందరికి పరిచయం చేసి.. ఈ ఆటను అందరూ ఆస్వాదించేలా చేయడమే ఈ జట్టు కొనుగోలుకు ముఖ్యం కారణం అని సమంత అన్నారు.


Click it and Unblock the Notifications











