జాన్వీ కపూర్‌పై అలాంటి రూమర్లు.. నిజమెంత? అవాస్తవమెంత?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర హీరోయిన్స్ కి పెద్దగా కొదవేమి లేదు. సౌత్ నార్త్ తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషలు హీరోయిన్స్ కూడా తెలుగులో రాణిస్తున్నారు. అంతే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర బాష పరంగా పెద్దదైన హిందీ సినిమా నటీనటులు కూడా టాలీవుడ్ లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

కాగా ఈ నటీనటుల్లో తెలుగులో తమ డెబ్యూ ఇస్తూ ఇద్దరు స్టార్స్ అయితే ఆర్ ఆర్ ఆర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా "దేవర" తో తెలుగు సినిమాకి పరిచటంపరిచయం కాబోతున్నారు. కాగా ఆ నటీనటులే జాన్వీ కపూర్ ఇంకా సైఫ్ అలీఖాన్. కాగా అలనాటి నటి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి మంచి గుర్తింపు ఉంది. అలాగే శ్రీదేవికి ఇండియా వైడ్ గా మెయిన్ గా మన తెలుగు సినిమాలో కూడా మంచి గుర్తింపు ఉంది.

Rumours on janhvi kapoor role in Jr NTR s devara movie

దీనితో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి లకు మంచి సినిమాలు పడగా ఇప్పుడు ఆమె వారసురాలు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ తెలుగులో అదే రామారావు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఏ హీరోకి కానీ హీరోయిన్ కి కానీ తమ ఎంట్రీ గ్రాండ్ లెవెల్లో ఉండాలని కోరుకోరు? కానీ జాన్వీ కపూర్

టాలీవుడ్ ఎంట్రీ మాత్రం పెద్దగా స్కోప్ లేకుండానే జరిగిపోతుందట. ఇప్పుడు చేస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకి మొదటి పార్ట్ లో పెద్దగా స్కోప్ ఉండదట. కేవలం కొంతసేపు స్క్రీన్ స్పేస్ మాత్రమే ఇంకా ఎన్టీఆర్ తో ఒక్క సాంగ్ మాత్రమే చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అయినా కూడా తన సినిమా పట్ల బాగానే ఎగ్జైట్ గా ఉంది. తన రోల్ ఎక్కువ శాతం పార్ట్ 2 లోనే కనిపిస్తుంది అని తెలిపింది.

Rumours on janhvi kapoor role in Jr NTR s devara movie

అయితే ముందు పార్ట్ 1 అనుకున్న అంచనాలు రీచ్ అయితేనే కదా పార్ట్ 2 కి ఎవరైనా ఎగ్జైట్ అయ్యేది. అలా ఒకవేళ పార్ట్ 1 ఏమైనా మిస్ ఫైర్ అయితే అసలు పెద్దగా స్కోప్ లేని మొదటి సినిమానే ఆమెకి ఒక డిజప్పాయింటింగ్ ఎంట్రీ అవుతుంది అని చెప్పాలి. మరి జాన్వీ కపూర్ కి తెలుగులో ఎలాంటి రాసి పెట్టి ఉందో ఇంకొంత కాలం ఆగి చూస్తే తెలిసిపోతుంది.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే తారక్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్, ఇంకా కొత్త నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ పతాకంపై సినిమా నిర్మితం అవుతుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Read more about: devara jr ntr janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X